నిత్యం దేశంలో.. ప్రపంచంలో కొత్త కొత్త విమానయాన సంస్థలు పుట్టుకొస్తున్నాయి.  దీంతో విమాన రంగంలో పోటీ ఏర్పడింది.  పోటీని తట్టుకొని నిలబడి విమాన సర్వీసులు నడపడం అంటే మాములు విషయం కాదు.  దేశంలో ఇప్పటికే చాలా వరకు విమానయాన సంస్థలు మూతపడ్డాయి.  ప్రభుత్వరంగ సంస్థ ఎయిర్ ఇండియా కూడా అప్పుల్లో కూరుకుపోయింది.  ఎయిర్ ఇండియాను అప్పుల నుంచి బయటపడేసేందుకు ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేస్తున్నది.  


చమురు కంపెనీలకు ఎయిర్ ఇండియా బకాయిలు భారీగా పేరుకుపోయాయి.  నెలకు రూ. 100 కోట్ల రూపాయల చొప్పున బకాయిలు చెల్లిస్తామని చెప్పిన ఎయిర్ ఇండియా దాన్ని ఇప్పటి వరకు అమలు చేయలేదు.  బకాయిలు చెల్లించకుంటే.. చమురు సరఫరాను నిలిపివేస్తామని హెచ్చరించింది.  అయితే, వ్యయాన్ని తగ్గించుకోవడానికి ఎయిర్ అయిందిగా టాక్సీ బాట్ సేవలు వినియోగించుకోవడానికి సిద్ధం అయ్యింది.  


టాక్సీ బాట్ సేవలు ఢిల్లీలోని ఎయిర్ పోర్ట్ లో సదా సిద్ధంగా ఉంటాయి.  ఢిల్లీ నుంచి ముంబై వెళ్ళవలసిన ఏ 320 విమానం టాక్సీబాట్ సేవలు వినియోగించుకుంది.  ఎయిర్ ఇండియా విమానం పార్కింగ్ స్థలం నుంచి రన్ వే వరకు టాక్సీబాట్ విమానాన్ని తీసుకెళ్తుంది.  రన్ వే మీదకు వెళ్లిన తరువాత ఇంజన్ ను స్టార్ చేసుకోవచ్చు.  ఫలితంగా ఇంజిన్ అరుగుదల, చమురు, ధ్వని కాలుష్యం కొంతమేర తగ్గుతుంది. 


ఈ విధానాన్ని మొదటిదారిగా ఎయిర్ ఇండియా ఏ 320 విమానం వినియోగించుకోవడం విశేషం.  వ్యయాన్ని తగ్గించుకునే విధానంలో  ఇదొకటి.  రన్ వే నుంచి పార్కింగ్ వరకు రావడానికి కనీసం ఒక్కో విమానానికి చాలా సమయం పడుతుంది. పైగా శబ్దకాలుష్యం.. చమురు వృధా అవుతుంది.  టాక్సీబాట్ సేవలు వినియోగించుకుంటే.. తక్కువ ఖర్చుతో త్వరగా పార్కింగ్ స్థలానికి చేరుకోవచ్చు. అదే విధంగా పార్కింగ్ నుంచి రన్ వే వరకు వెళ్లొచ్చు.  


మరింత సమాచారం తెలుసుకోండి: