మాములుగా మనిషి మరణించిన తరువాత అత్యక్రియల సమయంలో ప్రతి ఒక్కరు బాధపడతారు.  ఆ విషయం అందరికి తెలిసిందే.  బాధపడిన  ఉపయోగం ఉండదు.  ఈ విషయం తెలుసుకున్న మరణించిన వ్యక్తి.. అత్యక్రియల సమయంలో అందరిని నవ్వించాలని అనుకున్నాడు.  తాను మరణిస్తానని ముందుగానే తెలుసుకున్న ఆ వ్యక్తి.. చనిపోవడానికి ముందు తన వాయిస్ ను రికార్డ్ చేసుకున్నాడు.  


ఆ రికార్డ్ వీడియోను తన అంత్యక్రియల సమయంలో సేవపేటికను భూమిలో పెట్టిన తరువాత ప్లే చేయమని అడిగాడు.  అయన ఆఖరు కోరిక అదే కావడంతో.. అందరు సంతోషించారు.  ఖననం చేసే సమయంలో బంధుమిత్రులు అందరు మరుభూమికి చేరుకున్నారు.  అక్కడ శవపేటికను భూమిలో పెట్టి అయన ఆఖరి కోరికగా ఉన్న ఆ టేప్ ను ప్లే చేశారు.  ఆ టేప్ ను విని ప్రతి ఒక్కరు షాక్ అవ్వడమే కాదు పడీపడీ నవ్వుకున్నారు.


ఆ టేప్ ఇలా ఉన్నది.  టేప్ ను ప్లే చేయగానే.. టిక్ టిక్ అని శవపేటిక తలుపును కొడుతున్నట్టుగా సౌండ్ వచ్చింది.. నేను ఎక్కడ ఉన్నాను? నన్ను బయటకు తీయండి. ఇక్కడ చాలా చీకటిగా ఉంది. అక్కడ ప్రవక్త ఉన్నారా? ఆయనతో మాట్లాడవచ్చా? నేను శాయ్‌ను మాట్లాడుతున్నా. నేను శవపేటికలో ఉన్నా. కాదు.. కాదు.. నేను మీ ముందే ఉన్నా. నేను చనిపోయా అనే మాటలు వినిపించాయి.  


అవి చనిపోయిన వ్యక్తికీ సంబంధించిన వాయిస్ కావడంతో షాక్ అయ్యారు.  చనిపోవడానికి ముందు అయన రికార్డ్ చేసుకున్న వాయిస్ అది.  అందరు హ్యాపీగా ఉండాలని చెప్తూ అందరిని నవ్వించాడు చనిపోయిన శాయ్.  ఈ సంఘటన ఐర్లాండ్ లోని డబ్లిన్ లో జరిగింది.  శాయ్  బ్రాడ్లి సైన్యంలో పనిచేశాడు.  రిటైర్మెంట్ తరువాత చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్నాడు.  అందరితో కలిసిమెలిసి ఉండే ఉండేవాడు శాయ్.  అతనంటే అందరికి ఇష్టం కావడంతో చనిపోయినా ఎవరూ కూడా బాధపడకూడదని ఈ శాయ్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఈ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.  


మరింత సమాచారం తెలుసుకోండి: