భారతదేశంలో అత్యంత వివాదాస్పదమైన అంశం ఏదైనా ఉందంటే అది అయోధ్య భూ వివాదమే అని చెప్పాలి. అత్యంత కీలకమైన ఈ అంశంలో సుప్రీంకోర్టులో సుదీర్ఘ కాలంగా ఈ కేసు నడుస్తోంది. ఇందుకు సంబంధించిన వాదనలు 40 రోజులుగా కూడా  జరుగుతున్నాయి. దేశమంతా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఈ అయోధ్య భూ వివాదంలో సుప్రీం కూడా వాదనలు ముగించాలనే చూస్తోంది. ఈరోజు సుప్రీంలో ఈ అంశం ఓ కొలిక్కి వచ్చేలా కనిపిస్తోంది.

 

 

 

ఎంతో కీలకమైన ఈ అయోధ్య కేసుకు సంబంధించి ఇప్పటికే సుప్రీంలో విచారణ మొదలైంది. సుదీర్ఘంగా 40 రోజుల నుంచీ జరుగుతున్న వాదనలను నేటి సాయంత్రం 5 గంటలకల్లా పూర్తిచేయాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంగాన్ గొగోయ్ ఉభయ పక్షాల వారికి స్పష్టం చేశారు. నేటి సాయంత్రానికి ఈ వాదనలు ముగిస్తే.. సుప్రీంకోర్టులో అత్యంత సుదీర్ఘ కాలంగా విచారణ జరిగిన రెండో కేసుగా ఈ అయోధ్య భూ వివాదం కేసు నిలువనుంది. ఈ కేసులో తుది తీర్పు ఇవ్వాలని సుప్రీంకోర్టు భావిస్తోంది. ఇందుకు గత 39 రోజుల నుంచీ ఈ కేసుకు సంబంధించి వాదనలు వింటోంది. నిజానికి ఈ కేసు విచారణను అక్టోబర్ 18 కల్లా పూర్తిచేయాలని భావించింది సుప్రీం. కానీ అక్టోబర్ 17 కే పూర్తిచేయాలని నిర్ణయించారు. కానీ ఇప్పుడు ఓ రోజు ముందే అక్టోబర్ 16కి వాదనలు పూర్తి చేయాలని సుప్రీం భవిస్తోందని సమాచారం.

 

 

 

ఈ కేసుపై తీర్పు కోసం దేశం అంతా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు తుది తీర్పు ఇవ్వాలని నిర్ణయించింది. ఇప్పటికే ఈ కేసు తీవ్రత దృష్ట్యా అయోధ్యలో 144 సెక్షన్ అమలు చేశారు. వచ్చే నవంబర్ 17న ప్రస్తుత సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంగాన్ గొగోయ్ పదవీ విరమణ చేయనున్నారు. ఏ నేపథ్యంలో ఆయన పదవీ విరమణ నాటికి ఈ కేసులో తుది తీర్పు వెలువడనుందని తెలిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: