నారా లోకేష్ పదేపదే నోరు జారడం.. నెటిజన్లకు అడ్డంగా దొరికిపోవడం షరా మాములే అయ్యింది.  గతంలో ఎన్నికల ప్రచారం మంగళగిరి పేరును మందలగిరిగా మార్చేసిన ఘనుడు మన నారా లోకేష్ గారు.  అంతేకాదు, అదే ఎన్నికల ప్రచారంలో డెంగ్యూ ఫీవర్ గురించి అయన మాట్లాడిన మాటలు బూతులుగా మారాయి.  వీటిపై అప్పట్లో సోషల్ మీడియా ఓ ఆట ఆడుకుంది. అది మాములు అట కాదు రఫ్ ఆడించింది.  విరుచుకుపడింది.  లోకేష్ గారు మొదట మాట్లాడటం నేర్చుకోండి అని సోషల్ మీడియాలో జనాలు పేర్కొన్నారు.  


ఆ తరువాత కూడా మరలా మరలా అవే తప్పులు చేసుకుంటూ వచ్చారు లోకేష్.  అపర మేధావి, చాణక్యుడిగా చెప్పుకునే బాబు.. నారా లోకేష్ మాటలు ప్రసంగాలు విని పాపం ఎంతగా బాధపడి ఉంటారో అర్ధం చేసుకోవచ్చు.  బహుశా అందుకే ఆయనకు పార్టీలో ఇంకా కీలకమైన పదవిని అప్పగించలేదు.  ఇదిలా ఉంటె, ఇపుడు మరలా అదే తప్పును చేశాడు లోకేష్ బాబు. పాపం ఇప్పుడు వాజ్ పాయ్ బతికి ఉంటె ఎంతగా ఫీలయ్యేవారో చెప్పక్కర్లేదు.  


అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా లోకేష్ బాబు గుంటూరులో ప్రసంగించారు.  2012 లో వాజ్ పాయ్ ప్రధానిగా ఉన్నప్పుడు అని మాట్లాడారు.  వాజ్ పాయ్ 2012లో ప్రధానిగా ఉంటె మరి మన్మోహన్ సింగ్ ఏం చేస్తున్నారు అని చాలామంది ప్రశ్నిస్తున్నారు.  వాజ్ పాయ్ ప్రధానిగా ఎప్పుడు ఉన్నారో అందరికి తెలుసు.  వాజ్ పాయ్ ప్రధానిగా ఉన్నప్పుడు అబ్దుల్ కలాం రాష్ట్రపతిగా పనిచేశారు.  ఈప్రతిపాధనను వాజ్ పాయ్ ప్రభుత్వం మిత్రపక్షాలకు, ప్రతి పక్షాల ముందుకు తీసుకెళ్లారు.  


ఇలా వాళ్ళ ముందుకు తీసుకెళ్లడంతో..ప్రతి ఒక్కరు ఒకే చేశారు.  అబ్దుల్ కలాం కు అత్యున్నత పదవిని అందించి ఆయనను గౌరవించిన ఘనత బీజేపీ ప్రభుత్వానికి దక్కింది.  అయితే, దీన్ని తన ఖాతాలో వేసుకోవడానికి తెలుగుదేశం పార్టీ తెగ ప్రయత్నం చేసింది.  అబ్దుల్ కలాం పేరును తానే ముందుగా ప్రతిపాదించానని తన ప్రతిపాదనను వాజ్ పాయ్ అంగీకరించినట్టు చంద్రబాబు నాయుడు గతంలో చాలాసార్లు పేర్కొన్నారు.  అసలు విషయం ఏమిటో అందరికి తెలిసిందే.  వెంకయ్యనాయుడు సైతం ఏం జరిగిందో చెప్పి బాబు పరువు తీసిన సంగతి తెలిసిందే.  


మరింత సమాచారం తెలుసుకోండి: