సుదీర్ఘంగా పదకొండేళ్ల పాటు రాజకీయాల్లో ఉండి మళ్లీ  ముఖానికి మేకప్ వేసుకున్నారు మన టాలీవుడ్ లేడీ సూపర్‌స్టార్‌గా పేరు తెచ్చుకున్న విజయశాంతి. రాజకీయాల వల్ల టాలీవుడ్  ప్రేక్షకులు తనను ఎంతో మిస్సయ్యారు అని పేర్కొన్నారు. ఇప్పుడు  ఆమె  మహేష్ బాబు నటిస్తున్న ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో మళ్లీ వెండితెరపై కనువిందు చేయడానికి సిద్ధమయ్యారు. ఆమెను మళ్ళిఎప్పుడెప్పుడు  చూస్తామా అని తన అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు.

అయితే  ఆమె ఇక మీదట రాజకీయాల్లోకి వెళ్ళదు అని రిక్వెస్ట్ చేశారు ప్రముఖ సినీ రచయిత పరుచూరి గోపాల కృష్ణ.విజయశాంతి తన కూతురులాంటిదని చెప్తూ తన జీవితంలో మర్చిపోని అనుభవాన్ని ఒకటి అభిమానులతో పంచుకున్నారు ఆయన. ప్రస్తుతం షూటింగ్ అవుతున్న సరిలేరు నీకెవ్వరు సినిమాలో నేను ,విజయశాంతి కలిసి నటిస్తున్నాము .విజయశాంతి ఇదివరకు మా అన్నయ్య వెంకటేశ్వరరావుతో  నటించారు, కానీ నేనెప్పుడూ నటించలేదు. నన్ను విజయశాంతి అంకుల్ అని పిలిచేది.

తమ మధ్య జరిగిన ఓ సంఘటన గురించి సెట్‌లో అందరితో చెప్పారు పరుచూరిగారు.అపూర్వ సహోదరులు సినిమా షూటింగ్  సమయంలో విజయశాంతి వాళ్ల అమ్మగారు  గుండె నొప్పితో చనిపోయారు. కానీ మేము ఎవ్వరం ఆ విషయం తనకి తెలీకుండా దాచి,షూటింగ్ నుండి  తనని నేను నా భార్య కలిసి కారులో చెన్నైకి తీసుకెళ్లాం.తన తల్లి భౌతికకాయంపై పడి విలవిలా ఏడ్చింది. ముందే నాకు ఎందుకు చెప్పలేదు అంకుల్ అని అడగగా  ఎలా చెప్పగలను తల్లీ, ముందే చెబితే ఈ నాలుగు గంటలు నరకయాతన అనుభవించేదానివి అన్నాను.



విజయశాంతి అద్భుతయినా నటి.అసలు ఎందుకు రాజకీయాల్లోకి వెళ్లిందో తెలీదు. ఇప్పుడు మళ్లీ  ఇంతకాలం తరువాత ఎందుకు సినిమాల్లోకి వచ్చిందో తెలీదు. కానీ తను మళ్లీ రాజకీయాల్లోకి వెళ్లకూడదని నేను కోరుకుంటున్నాను. రాజకీయాల్లోకి వెళితే ఎలా ఉంటుందో తనకు ఈపాటికి బాగా అర్థమై ఉంటుంది. కాబట్టి సినిమాలు కొనసాగిస్తూ ప్రేక్షకులను ఇలాగే అలరించి,మెప్పించాలి అని నేను  కోరుకుంటున్నాను’ అని మీడియా ముందు చెప్పుకొచ్చారు పరుచూరి.


మరింత సమాచారం తెలుసుకోండి: