రాష్ట్రంలో అధికారంలో ఉన్న స‌మ‌యంలో టీడీపీ అమ‌లు చేసిన ప‌థ‌కాలు, ప్ర‌జ‌ల‌ను ఆక‌ర్షించిన విష యా ల్లో ప్ర‌త్యేక ప్లేస్‌లో ఉంటే.. ఒక్క ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో మాత్రం ఓ నాయ‌కుడి కార‌ణంగా వివాదం గా మారి పోయింది. ఆయ‌నే దెంద‌లూరు మాజీ ఎమ్మెల్యే చింతమ‌నేని ప్ర‌భాక‌ర్‌. టీడీపీ అధినేత చంద్ర‌బా బు సామా జిక వ‌ర్గానికి చెందిన నాయ‌కుడు అయి ఉండి కూడా ఎస్సీ, ఎస్టీలు,మ‌హిళ‌లు, అధికారుల‌పై ఆయ‌న దూకు డు ప్ర‌ద‌ర్శించాడు. తాను నియోజ‌క‌వ‌ర్గానికి చేస్తున్న అభివృద్ధి ముప్పావ‌లా అయినా.. పావ‌లా వంతు ఇ లాంటి ఆగ‌డాలు చేయ‌డంతో ఆయ‌న వ‌ల్ల పార్టీకి టోట‌ల్‌గా బ్యాడ్ నేమ్ వ‌చ్చింది. ప్ర‌స్తు తం చింత‌మ‌నేని వివిధ కేసుల్లో చిక్కుకుని ఊచ‌లు లెక్కిస్తున్న విష‌యం తెలిసిందే.


చింత‌మ‌నేని వ్య‌వ‌హారంతో చంద్ర‌బాబు కూడా త‌లెత్తుకోలేని ప‌రిస్థితి దాపురించింది. ఈ వ్య‌వ‌హార‌మే టీడీ పీకి చిరిగి చాటై కూర్చుంటే.. ఇప్పుడు మ‌రో నాయ‌కుడు చింత‌మ‌నేనిని మించి పోయే రికార్డు సృష్టిం చా ల‌ని భావిస్తున్నాడు. ఆయ‌నే విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెల‌గ‌పూడి రామ‌కృష్ణ‌బాబు. ఈయ‌న కూడా బాబు సామాజిక‌వ ర్గ‌మే. దూకుడు కూడా ఎక్కువే. మ‌ద్యం వ్యాపారిగా ఉన్న వెల‌గ‌పూడి 2009లో టీడీపీ టికెట్ కైవ‌సం చేసుకుని విజ‌యం సాధించారు. ఇక‌, అప్ప‌టి నుంచి 2014 స‌హా ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ సునామీని త‌ట్టుకుని మ‌రీ విజ‌యం సాధించారు. అయితే, ఈ విజ‌యాన్ని ఆశ్వాదించాల్సిన వెల‌గ‌పూడి రానురాను దూకుడు ప్ర‌ద‌ర్శించి చిక్కుల్లో కూరుకుపోతున్నాడు.


మూడవసారి ఎమ్మెల్యేగా గెలిచిన వెలగపూడి రామకృష్ణబాబు విజయోత్సవ ఊరేగింపుని కూడా ఎన్నికల నియమాలకు వ్యతిరేకంగా ఎలాంటి అనుమతి లేకుండా నిర్వహించారు. ఆ సందర్భంగా వెలగపూడి రామకృష్ణబాబు అప్పటికే వైసీపీకి మెజారిటీ వచ్చి సీఎం అవుతాడని తెలిసినా కూడా జగన్ ని అసభ్యపదజాలంతో దూషించారు. దాని మీద వైసీపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు అయింది. అది అలా ఉండగానే తాజాగా చంద్రబాబు విశాఖ వచ్చిన సందర్భంగా అనుమతి లేకుండా ర్యాలీ తీయడం, ఏకంగా పోలీసులనే నిలదీయడం, వాగ్వాదం పెంచుకోవడం వంటివి సంచ‌ల‌నం సృష్టించాయి.


ఈ క్ర‌మంలోనే పోలీసులు వివిధ ఫిర్యాదుల‌పై స్పందించి  వరసగా నాలుగైదు కేసులు వెలగపూడి పై న‌మోదు చేశారు. మ‌రోప‌క్క‌, వెల‌గ‌పూడి దూకుడును వైసీపీ అధిష్టానం నిశితంగానే ప‌రిశీలిస్తోంది. అదును చూసి చ‌ర్య‌లు తీసుకునేందుకు కూడా ప్ర‌భుత్వం సిద్ధంగా ఉన్న‌ట్టు తెలుస్తోంది. అంటే, ఇప్పుడు చింత‌మ‌నేని మాదిరిగానే .. ఒక్క‌సారి అరెస్టు చేస్తే.. ఇక‌, వివిధ కేసుల్లో బ‌య‌ట‌కురాకుండా నాయ‌కులు అల్లాడే ప‌రిస్థితి ఏర్ప‌డ‌నుంది. మ‌రి ఈయ‌న కూడా మ‌రో చింత‌మ‌నేని అవుతారా?  లేక‌.. మౌనంగా ఉండి త‌న ప‌ని తాను చేసుకుపోతారా?  చూడాలి!


మరింత సమాచారం తెలుసుకోండి: