ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన ఈరోజు జరిగిన కేబినేట్ సమావేశం మూడు గంటలకు ముగిసింది. మంత్రివర్గంతో చర్చలు జరిపి సీఎం జగన్ ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. మంత్రి వర్గం చేనేత కార్మిక కుటుంబాలకు 24 వేల రూపాయల సాయం, మత్స్యకారులకు వేట నిషేధ సమయంలో ఇచ్చే 10 వేల రూపాయల సాయంకు ఆమోద ముద్ర వేసింది. 
 
సమాచార శాఖ మంత్రి పేర్ని నాని మీడియాకు కేబినేట్ భేటీలో తీసుకున్న నిర్ణయాల గురించి వివరించారు. వైయస్సార్ నేతన్న నేస్తం పథకం కింద 24 వేల రూపాయలు చేనేత కార్మికులకు ప్రతి సంవత్సరం డిసెంబర్ 21వ తేదీన ఇవ్వాలని  216 కోట్ల రూపాయలు ఈ పథకానికి ఖర్చు చేయాల్సి ఉండగా ఈ పథకం ద్వారా 90 వేల కుటుంబాలు లబ్ధి పొందుతాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. మెకనైజ్డ్ బోట్లతో పాటు తెప్పలపై వేట సాగించే మత్స్యకారులకు వేట నిషేధ సమయంలో 10 వేల రూపాయల ఆర్థిక సాయం ప్రభుత్వం అందిస్తుంది. 
 
నవంబర్ 21వ తేదీ నుండి ఈ పథకం అమలు కాబోతూ ఉండగా 100 కోట్ల రూపాయలు ఈ పథకానికి అవసరం అవుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. హోంగార్డుల జీతాలను రోజుకు 600 రూపాయల ఆలవెన్స్ నుండి 710 రూపాయలకు పెంచుతూ కేబినేట్ నిర్ణయం తీసుకుంది. వాటర్ గ్రిడ్ కార్పొరేషన్ తో ప్రజలందరికీ ప్రభుత్వం సురక్షితమైన మంచినీరు అందించబోతుంది. 50 కోట్ల రూపాయలతో శ్రీకాకుళం జిల్లా పలాసలో 200 పడకల ఆస్పత్రి మరియు రీసెర్చి సెంటర్ లో 100 కాంట్రాక్ట్, 5 రెగ్యులర్, 60 ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల నియామకానికి కేబినేట్ ఆమోదం తెలిపింది. 
 
మధ్యాహ్న భోజన పథకం కార్మికుల వేతనం 3,000 రూపాయలకు పెంచుతూ కేబినేట్ నిర్ణయం తీసుకుంది. బార్ అసోసియేషన్ కౌన్సిల్ లో  సభ్యులుగా ఉన్న న్యాయవాదులకు ప్రభుత్వం నెలకు 5 వేల రూపాయలు ఇచ్చేందుకు కేబినేట్ ఆమోదంతెలిపింది. 200 డ్రిల్లింగ్ యంత్రాల కొనుగోలుతో ప్రభుత్వం రైతుల భూముల్లో బోర్లు వేసేందుకు కేబినేట్ ఆమోదం తెలిపింది. 3,500 పాత బస్సులను తొలగించి కొత్త బస్సుల కొనుగోలు కొరకు కేబినేట్ ఆమోదం తెలిపింది. 



మరింత సమాచారం తెలుసుకోండి: