అయోధ్య భూ వివాదంపై   దేశ అత్యున్నత న్యాయ స్థానం తీర్పు రాబోతోంది. ఏళ్ళకు ఏళ్లుగా సాగిన ఈ వివాదం ఇపుడు దేశ న్యాయ స్థానం ముందు  ఉంది. మరి ఏ విధంగా తీర్పు వస్తుందో అన్న ఆసక్తి ఓ వైపు టెన్షన్ మరో వైపు ఉన్నాయి. దాదాపు అయిదు వందల ఏళ్ల క్రితం బాబర్ దండెత్తి ఇక్కడ రాముల వారి ఆలయాన్ని కూలగొట్టారని హిందూవాదులు ఆరోపిస్తూ వచ్చారు.


ఇక ముస్లింలు ఇది తమ స్థలమేనని అంటున్నారు. బాబర్ సమాధిగా ఉందని అంటున్నారు. మరి ఈ స్థలం వివాదం స్వంతంత్ర భారత దేశ చరిత్రలో సుదీర్ఘమైనదిగా చెప్పాలి 1940 ప్రాంతంలో ఆరంభమైన ఏ తగువు రాజకీయ ప్రేరేపితంగా మారి 1992 డిసెంబర్ 6న ఏకంగా బాబ్రీ మసీద్ కూలగొట్టడానికి కారణమైంది. అప్పట్లో దేశవ్యాప్తంగా జరిగిన మత కలహాల్లో మొత్తం రెండు వేల మందికి పైగా చనిపోయారు.


ఆ తరువాత పోలీసు కేసులు ఓవైపు నడుస్తూండంగానే న్యాయస్థానంలో కూడా ఈ వ్యాజ్యం నడుస్తోంది.  2010లో అలహాబాది హైకోర్టు బాబ్రీ స్థలాన్ని మూడు వాటాలు వెసై పంచుకోమని చెప్పింది. అక్కడ కుదరకపోవడంతో సుప్రీం కోర్టుకు  ఈ కేసు చేరింది. ఇక దాదాపు తొమ్మిదేళ్ల తరువాత ఈ కేసు విచారణ ఈ రోజు పూర్తి అయింది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగొయ్ అధ్యక్షతన  అయిదుగురు సభ్యుల కమిటీ కూర్చుని ఈ కేసు విచారణ చేసింది.


ఈ రోజుల్తో కేసు విచారణ ముగుస్తున్న  నేపథ్యంలోనే ఈ స్థలంపై సుప్రీం కోర్టులో పిటీషన్ వేసిన ప్రధాన కక్షిదారు సున్నీ వక్ఫ్ బోర్డు కేసును వెనక్కి తీసుకోవడానికి రెడీ కావడం.. సుప్రీం కోర్టు ధర్మాసనానికి తెలుపడం సంచలనంగా మారింది. ఈ పరిణామంతో  అయోధ్య కేసులో కొత్త మలుపు చోటు చేసుకుంది. మరి ఈ రేపు తీర్పు చెప్పబోతున్నారని అంటున్నారు. మరి ఎవరికి అనుకూలంగా వస్తుందో. కోర్టు ఏం చెప్పబోతోందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: