కేంద్ర వైద్య - ఆరోగ్య సహాయ మంత్రి అశ్వినీ చౌబేకు ఊహించని షాక్ తగిలింది. గుర్తు తెలియని ఇద్దరు యువకులు అతనిపై సిరాను చల్లారు. ఈ ఘటనలో అతని చొక్కాతో పాటు కారుపై కూడా సిరా మరకలు పడ్డాయి. అసలు ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను మనం తెలుసుకుందాం.

ఇటీవల బీహార్ రాష్ట్రంలో వర్షాలు అతలాకుతలం చేసిన సంగతి మనకి తెలిసిన విషయమే. అయితే వరదలు తగ్గుముఖం పట్టినప్పటికిని అశుభ్రత - మురికి - దోమలు వల్ల ప్రజలు రోగాల భారీన పడుతున్నట్టు సమాచారం. దోమల వలన రాష్ట్రంలో డెంగ్యూ వంటి ప్రమాదకరమైన ఎన్నో రోగాలు పెరుగుతున్నాయి.

అయితే ఈ క్రమంలో కేంద్ర వైద్య ఆరోగ్య సహాయ మంత్రి పాట్నా మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో డెంగ్యూ రోగులను పరామర్శించేందుకు వెళ్లారు. ఈ నేపథ్యంలో మంత్రి తన కారు పార్క్ చేసి హాస్పిటల్ లోపలకి వెళ్ళేప్పుడు గుర్తు తెలియని ఇద్దరు యువకులు అతనిపై సిరా చల్లారు. సిరా చల్లిన వెంటనే ఆ యువకులు అక్కడి నుంచి తప్పించుకున్నారు. ఆ తర్వాత మంత్రి కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయారు.

ప్రజలు అనారోగ్య భారిన పడుతుంటే ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అనే దానిపై యువకులు నిరసన, అసహనం వ్యక్తం చేస్తూ ఈ విధమైన దాడికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. ఇక ఈ ఘటనపై కేంద్ర మంత్రి చౌబే స్పందిస్తూ… ఇది తనపై జరిగిన దాడి కాదని.. ప్రజాస్వామ్యంపై జరిగిన దాడి అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. కాగా ఇటీవల చౌబే పోలీసులకు వార్నింగ్ ఇచ్చి వివాదంలో చిక్కుకున్నారు. బీజేపీ కార్యకర్తలపై కేసులు పెడుతున్నారంటూ ఓ పోలీసు అధికారిపై దురుసుగా ప్రవర్తించిన చౌబే!!.. ఒంటిపై పోలీసు దుస్తులు లేకుండా చేస్తానంటూ పోలీసు వారిని హెచ్చరించారు.

మంత్రి స్థానములో ఉండి ప్రజల గురించి కాస్త పట్టించుకోని పక్షాన ప్రజలే తమను పట్టించుకుంటాం అని గుర్తు చేసేందుకే ఆ యువకులు అలా చేసి ఉంటారని బీహార్ ప్రజల అభిప్రాయం..

 

మరింత సమాచారం తెలుసుకోండి: