తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ టీఎస్ఆర్టీసీ కార్మికులు తెలంగాణ వ్యాప్తంగా చేస్తున్న సమ్మె ఇంకా  కొనసాగుతోంది. కోదాడలో ఆర్టీసీ కార్మికులతో టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశం కావడం జరిగింది. వారి సమస్యల గురించి అడిగి మరి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ… ఈ నెల 19న తలపెట్టిన తెలంగాణ బంద్ కు కాంగ్రెస్ మద్దతు పలుకుతుంది అని అయినా తెలియచేసారు. సిఎం కెసిఆర్‌ రాష్ట్రంలోని 50 వేల మంది ఆర్టీసీ కార్మికులను రోడ్డున పడేశారని, ప్రజా స్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది.


ఇక ఒక వైపు ఉప ఎన్నికలు  జరుగుతున్న హుజూర్ నగర్ లో కాంగ్రెస్ ను గెలిపించి ప్రజాస్వామ్యాన్ని బతికించాలని ఉత్తమ్ కుమార్ కోరడం జరిగింది. ఆర్టీసీ కార్మికులు ఈ ఉప ఎన్నికలో తమ పార్టీకే మద్దతు ఇవ్వాలని ఆయన కోరడం కూడా జరిగింది. కాగా, పలు జిల్లాల్లో ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా ప్రతిపక్ష పార్టీల నేతలు నిరసనల్లో పాలకొంటున్నారు. హైదరాబాద్ లోని టీఎంయూ కార్యాలయంలో ఆర్టీసీ నేతలు అత్యవసరంగా భేటీ అవ్వడం జరిగింది. సమ్మె, భవిష్యత్ కార్యాచరణలపై చర్చలు కోన సాగించారు.


ఉప ఎన్నికలో మరి ఏవరు నిలుస్తారో చూడాలి మరి. టీఎస్ఆర్టీసీ కార్మికులు సమ్మె కారణంగా  ఉపఎన్నికలో  కెసిఆర్ సర్కార్ నెగ్గుతుందో లేదో చూడాలి మరి. టీఎస్ఆర్టీసీ కార్మికులు సమ్మె మాత్రం అన్ని వర్గాలు మద్దతులు ఇస్తూనే  వస్తున్నారు. ఇక కెసిఆర్  ప్రచారంలో ఏ విషయం పై చర్చిస్తారో మరి చూడాలి. ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఉప ఎన్నికలో  ప్రచారం బాగానే చేయడం జరిగింది.

ఉప ఎన్నికలు జరిగితే తప్ప ఏమి చెప్పడానికి వీలు లేదు అని పిస్తుంది. ఎట్టకేలకు కెసిఆర్ ప్రభుత్వానికి విజయం దక్కుతుందో లేదో మరి.  సమ్మె ఎఫెక్ట్ పడుతుంది అని కొంత మంది వాళ్ళ భావన తెలియచేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: