ప్రధాని నరేంద్ర మోదీ నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్న తరువాత ప్రజలు చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. నోట్ల రద్దు తరువాత ఆర్బీఐ 2,000 రూపాయల నోట్లు తెచ్చినప్పటికీ ప్రజలు ఆ నోట్లతో చిల్లర కోసం పడిన ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ఆర్బీఐ ఆ తరువాత 10 రూపాయలు, 20 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయలు, 200 రూపాయలు, 500 రూపాయల కొత్త నోట్లను కూడా ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. 
 
కానీ ఆర్బీఐ ప్రస్తుతం 2,000 రూపాయల నోట్ల ముద్రణ ఆపివేసింది. సమాచార హక్కు చట్టం ద్వారా ఒక వార్తా సంస్థ ఆర్బీఐని 2,000 రూపాయల నోట్ల  గురించి కోరగా ఈ సమాచారం వెలుగులోకి వచ్చింది. ఈ సమాచారంతో 2 వేల రూపాయల నోటు రద్దు కాబోతుందనే ప్రచారం ఊపందుకుంది. మరోవైపు ఎస్బీఐ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఏటీఎంలలో 2,000 రూపాయల నోట్లను ఉంచే క్యాసెట్లను కూడా తొలగించింది. 
 
క్యాసెట్ల తొలగింపుతో నోట్ల రద్దు ప్రచారానికి మరింతగా ప్రచారం జోరందుకుంది. 2000 రూపాయల నోట్ల రద్దు గురించి ప్రచారం జరుగుతున్న సమయంలో వెయ్యి రూపాయల నోటు ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది ఫేక్ 1000 రూపాయల నోటా...? లేదా నిజమైన 1,000 రూపాయల నోటా..? అనే విషయం మాత్రం తెలియాల్సి ఉంది. కేంద్ర ప్రభుత్వం నుండి కానీ ఆర్బీఐ నుండి కానీ 1,000 రూపాయల నోటు గురించి ఎలాంటి ప్రకటన రాలేదు కాబట్టి కొత్త 1,000 రూపాయల నోటు ఫేక్ అనే భావించాలి. 
 
2,000 రూపాయల నోటు రద్దు చేస్తే మాత్రం ఆర్బీఐ కొత్త 1,000 రూపాయల నోటును నిజంగానే తీసుకొచ్చే అవకాశం ఉంది. గతంలో కూడా 1,000 రూపాయలకు సంబంధించిన ఫేక్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆర్బీఐ నుండి ప్రకటన వచ్చే వరకు నోట్ల రద్దు, కొత్త 1,000 రూపాయల నోటు గురించి వస్తున్న ప్రకటనలు నిజం కాదని భావించక తప్పదు. 



మరింత సమాచారం తెలుసుకోండి: