తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు గత పన్నెండు రోజులుగా సమ్మో చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వ వైఖరి కారణంగా మనస్థాపం చెంది ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్య చేసుకొని మృతి చెందుతున్న సంగతి విధితమే. అయినప్పటికీ ప్రభుత్వం ఏమాత్రం స్పందించటం లేదు. అయితే తాజాగా ఆర్టీసీ ఉద్యోగులకు దీపావళి కనుక ఇచ్చింది ప్రభుత్వం. అయితే దీపావళి కనుక ఆర్టీసీ కార్మికులకు కాదు గుజరాత్ ఆర్టీసీ కార్మికులకు.                

                                    

 గుజరాత్ ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులకు దీపావళి కనుక ప్రకటించింది. అక్కడి బీజేపీ ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగుల జీతాలను భారీగా పెంచుతూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీలో స్థిర వేతనం పొందుతున్న 12 వేల 692 మందికి జీతాలు పెంచాలని గుజరాత్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు జీతాలు పెంచుతున్నట్టు ప్రకటించింది.           

                                      

అయితే ఈ జీతాల పెంపు అక్టోబర్ 16వ తేదీ బుధవారం నుంచి పెరిగిన వేతనాలు అమల్లోకి వస్తాయని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నితిన్ పటేల్ ప్రకటించారు. కాగా ప్రతి సంవత్సరం ఇలా వేతనాలు పెంచడం వల్ల రూ.92.40 కోట్ల భారం అదనంగా పడుతుందని ఉప ముఖ్యమంత్రి నితిన్ పటేల్ తెలిపారు. కాగా ఈ పెంపుతో ప్రతి ఒక్కరికి 6 వేల రూపాయిలు జీతం పెరిగింది.              

                                       

మరింత సమాచారం తెలుసుకోండి: