థాయ్ లాండ్ లో సర్పాల పరిరక్షక బృందం 13 అడుగుల పొడవు గల నాగుపామును పట్టుకుంది. స్థానికులు ఒక ఎస్టేట్ లో పామును గుర్తించగా పాము గురించి సర్పాల పరిరక్షణ బృందానికి సమాచారం అందించారు. ఎస్టేట్ కు చేరిన సర్పాల పరిరక్షణ బృందం పామును పట్టుకోవటం కోసం చాలా ప్రయత్నాలు చేసింది. ఒక గొట్టం గుండా తప్పించుకోవటానికి ప్రయత్నం చేసిన పాము తోకను పట్టుకుని సర్పాల పరిరక్షక బృందం బంధించింది. 
 
పామును పట్టుకునే ముందు బృంద సభ్యులు కొంతసేపు ప్రత్యేకమైన ప్రార్థనలు చేశారు. ఈ నాగుపాము నాలుగు మీటర్ల పొడవు, 15 కిలోలకు పైగా బరువు ఉందని బృంద సభ్యులు తెలిపారు. సమీపంలోని అడవుల్లో సర్పాల పరిరక్షణ బృందం నాగుపామును వదిలిపెట్టారు. సర్పాల సంరక్షకులు ఈ పామును మూడవ అత్యంత పొడవైన పాముగా గుర్తించారు.

విషం ఎక్కువగా ఉండే పాములలో నాగుపాము కూడా ఒకటి. సాధారణంగా నాగుపాములు మూడు అడుగుల నుండి ఆరు అడుగుల వరకు ఉంటాయి. మన దేశంలోని నాలుగు విషపూరితమైన పాములలో నాగుపాము ఒకటి. నాగుపాముకు పడగ వెనుక వైపుకు రెండు అండాకార గుర్తులు ఒక గీతతో కలపబడి ఉంటాయి. నాగుపాములో పాము రంగు మరియు పడగ వెనుక వైపు ఉండే గుర్తులను బట్టి వివిధ రకాలు ఉంటాయి. మన దేశంలో ఎక్కువ మరణాలకు కారణమయ్యే పాముల్లో నాగుపాము కూడా ఒకటి. 
 
నాగుపాము నుండి అప్పుడే పుట్టిన పిల్ల పాములకు కూడా విషపు గ్రంథులు ఉంటాయి. సాధారణంగా నాగుపాము ఎలుకలను ఆహారంగా తీసుకుంటుంది. నాగుపాము యొక్క శాస్త్రీయ నామం నాజా నాజా. నాగుపాముకు చెవులు వినపడవు. మన దేశంలో నాగుల చవితి పండుగ రోజు ఈ పామును పూజిస్తారు. భారతదేశంలోని పురాణాలలో కూడా నాగుపాముకు ప్రత్యేకమైన స్థానం ఉంది. 
 



మరింత సమాచారం తెలుసుకోండి: