జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి అనేక పథకాలను అమలు చేస్తున్నారు. మరికొన్ని పథకాల అమలుకు టైం టేబుల్ ప్రకటించేశారు. జగన్ అమలు చేస్తున్న, ప్రకటించిన పథకాలకు వేల కోట్ల రూపాయలు కావాలి. మరి ఇప్పటికే రూ. 2.6 లక్షల కోట్ల అప్పుల్లో ఉంది రాష్ట్రం. పైగా చంద్రబాబునాయుడు అధికారంలో నుండి దిగిపోయేనాటికి ఖజానాలో ఖాళీ బొచ్చే ఉంది.

 

అయినా ఏ ధైర్యంతో పథకాలు అమలు చేస్తున్నారు ? అసలు పథకాలు అమలు చేయాలంటే వేల కోట్ల రూపాయల నిధులు ఎక్కడి నుండి వస్తున్నాయి ? ఎలాగంటే నిధులకు రెండు రకాల మార్గాలున్నాయి. మొదటిది పన్నుల వసూళ్ళు. ఎక్సైజ్, రెవిన్యు, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్, రవాణా శాఖ, విద్యుత్   లాంటి అనేక శాఖల ద్వారా  ప్రభుత్వానికి రెవిన్యు వస్తుంటాయి.

 

సరే ఈ శాఖల ద్వారా వచ్చే వసూళ్ళలో  ఉద్యోగుల జీతాలు-బత్యాలు, పెన్షన్లు, బిల్లుల చెల్లింపు లాంటి ఉంటాయి. ఇక రెండో మార్గం ప్రభుత్వం అప్పులు చేయటం. అయితే మూడో మార్గం కూడా ఉందన్న విషయం చాలామందికి తెలీదు. అదేమిటంటే అవినీతిని నియంత్రించటం, వృధా ఖర్చులను తగ్గించటం. వృధా ఖర్చులు తగ్గించటం వల్ల వేల కోట్ల రూపాయలేమీ మిగలకపోయినా ఆర్ధిక క్రమశిక్షణ ఉన్నదనే విషయం అర్ధమవుతుంది.

 

ఇక ఫైనల్ గా అవినీతి నియంత్రించటమన్నదే చాలా పెద్ద ఆదాయ మార్గం. ఇంతకుముందు ప్రభుత్వాల్లో సుమారు 30 శాతం అవినీతి జరిగిందనే అంచనాలున్నాయి. చంద్రబాబునాయుడు ప్రభుత్వంలో మరింత ఎక్కువగా జరిగిందనే ఆరోపణలూ ఉన్నాయి. ఈ విషయంలోనే జగన్ గట్టిగా దృష్టిపెట్టారు.


ప్రభుత్వంలో జరిగే అవినీతిని గట్టిగా నియంత్రించగలిగితే ఏడాదికి సుమారు రూ. 35 వేల కోట్లు మిగులుతుందనే అంచనా ఉంది. అలాగే ప్రతీ శాఖలోను రివర్స్ టెండర్ విధానాన్ని గట్టిగా అమలు చేయగలిగితే ఏడాదికి తక్కువలో తక్కువ రూ. 2 వేల కోట్లు మిగులుతాయట. అవినీతిని నియంత్రించటం, దుబారాను అరికట్టటం, ఆదాయాలను పెంచుకుంటే తన పథకాలన్నింటిని సక్సెస్ ఫుల్లుగా అమలు చేయొచ్చని జగన్ గట్టి ధైర్యంతో ఉన్నారట.

 


మరింత సమాచారం తెలుసుకోండి: