ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి ఏ సమయంలో ఎలా వ్యవహరించాలో బాగా తెలిసినట్లుంది. అందుకే అధికారం చేపట్టిన దగ్గర నుంచి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో సన్నిహితంగా మెలుగుతున్నారు. ప్రతి విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే పలు మార్లు ఢిల్లీకి వెళ్ళిన ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షాల పట్ల విధేయతగానే ఉంటున్నారు. అలాగే కేంద్రానికి ఇచ్చే విలువ ఇస్తూనే పరిపాలనలో దూసుకెళుతున్నారు. రాష్ట్రానికి సంబంధించి ఏ సమస్య ఉన్న కేంద్రాన్ని రిక్వెస్ట్ చేస్తున్నారే తప్ప...దూకుడుగా వెళ్ళడం లేదు.


ఇక చంద్రబాబులా కేంద్ర పథకాలని తన పథకాలుగా చెప్పుకుంటూ స్టిక్కర్ వేసుకోకుండా, కేంద్రానికి ఇచ్చే వాల్యూ ఇస్తున్నారు. తాజాగా రైతు భరోసాలో కేంద్రం వాటా ఉండటంతో ఆ పథకానికి వైఎస్సార్ రైతు భరోసా-పి‌ఎం కిసాన్ అనే పేరు పెట్టారు. అయితే జగన్ బీజేపీ పట్ల ఇలా ఉండటానికి ప్రధాన కారణం రాష్ట్ర ప్రయోజనాలు. అందుకే కేంద్ర ప్రభుత్వంతో సన్నిహితంగా ఉంటున్నారు. 


కానీ రాష్ట్ర బీజేపీ నేతలు మాత్రం రోజు జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూనే ఉన్నారు.  అలాగే కేంద్ర ప్రభుత్వం ద్వారా జగన్ ని ఇబ్బందులు పెట్టాలని చూస్తున్నారు. అటు టీడీపీ చంద్రబాబు కూడా బీజేపీకి దగ్గర అవ్వాలని చూస్తున్నారు. కానీ బీజేపీ నేతలు ఆ ఛాన్స్ లేదనే చెప్పేస్తున్నారు. అయితే ఇలా రెండు పార్టీలు పట్ల బీజేపీ యాంటీగా ఉండటానికి ప్రధాన కారణం. ఏపీలో బీజేపీ ఒంటరిగా ఎదగాలని చూస్తోంది. వచ్చే ఎన్నికల నాటికైనా బలపడాలని అనుకుంటుంది. అందుకే ఎక్కువ అధికార వైసీపీతో కయ్యం పెట్టుకుంటుంది. అది అలాగే కొనసాగించాలని చూస్తోంది. 


అయితే ఇక్కడ జగన్ ని తక్కువ అంచనా వేస్తే అంతే సంగతులు. ప్రస్తుతానికి ఏదో రాష్ట్ర ప్రయోజనాలు కోసం సైలెంట్ గా ఉంటున్నారు. లేదంటే బీజేపీకి తిప్పలు ఉండేవి. ఇప్పటికే బీజేపీ వలసలని ప్రోత్సహిస్తూ...ముందుకెళుతుంది. అందుకే దీనికి కౌంటర్ గా జగన్ తాజాగా టీడీపీ, జనసేన నేతలనీ పార్టీలోకి చేర్చుకుంటున్నారు. ఏదిఏమైనా జగన్ ఏపీలో బీజేపీని బలపడనివ్వడం కష్టమే. కాబట్టి బీజేపీ జగన్ తో కయ్యానికి కాలు దువ్వకుండా ఉంటే మంచిది. 


మరింత సమాచారం తెలుసుకోండి: