ఆంధ్రప్రదేశ్ దేశంలోనే రెండో అతి పొడవైన తీరం ఉన్న రాష్ట్రం. సముద్ర తీరంలో ఎక్కువగా ఉండే సామాజిక వర్గం మత్స్యకారులు. సముద్రం పైనే వీరి బతుకు తెరువు. కానీ.. నిబంధనల ప్రకారం ఏటా కొంతకాలం వేటపై నిషేధం ఉంటుంది. ఆ కాలంలో మత్స్యకారులకు పని ఉండదు. కానీ పనిలేదని ఆకలి లేకుండా ఉండదుగా.


ఆ ఆకలి కేకలను ఏపీ సీఎం జగన్ మనసుతో విన్నారు. ప్రాణాన్ని ప్రణంగా పెట్టి సముద్రం నడిమధ్యలో వేట చేస్తున్న మత్స్యకారులకు మేలు చేసే నిర్ణయం తీసుకున్నారు. వైయస్‌ జగన్‌ పాదయాత్రలో మత్స్యకారుల బాధలు విన్న సమయంలో ఇచ్చిన హామీని ఇప్పుడు నిలబెట్టుకున్నారు. వేట నిషేధ కాలంలో రూ.10 వేలు ఆర్థికసాయాన్ని అందించాలని రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసింది.


మేకనైజ్‌డ్‌ బోట్లు, మోటార్లు లేని కుటుంబాలే కాకుండా తెప్పలపై సముద్రంలో వేటకు వెళ్తున్న కుటుంబాలను కూడా ఈ పథకంలోకి తీసుకువస్తూ మంత్రివర్గం ఆమోదించింది. ఎన్నికల ముందు చెప్పిన మాటను నవంబర్‌ 21న అంతర్జాతీయ మత్స్య దినోత్సవం రోజున ఈ పథకాన్ని అమలు చేస్తారు. మత్స్యకారులు వేటాడే బోట్లకు వాడే డీజిల్‌ మీద లీటర్‌పై రూ.9 సబ్సిడీ ఉండగా దానికి 50 శాతం పెంచి అదనంగా ఇస్తారు.


నిర్దేశిత డీజిల్‌ పంపులను ఫిషింగ్‌ హార్బర్ల వద్ద ఏర్పాటు చేసి అయిల్‌ కొట్టిన వెంటనే సబ్సిడీ అందించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని కూడా నవంబర్‌ 21 నుంచి అమలులోకి తీసుకువస్తారు. ఆయిల్‌ సబ్సిడీ సుమారు రూ.100 కోట్లు అవుతుందని అంచనా వేస్తున్నారు.


ముమ్మిడివరం నియోజకవర్గంలోని గుజరాత్‌ స్టేట్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ చేపట్టిన అయిల్‌ అన్వేషణలో ఉపాధి కోల్పొయిన 16500 మంది మత్స్యకారులకు ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు నవంబర్‌ 21న చెల్లించేందుకు కూడా కేబినెట్ నిర్ణయం తీసుకుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: