ఆర్టీసీ సమ్మె ఇప్పటికే రాష్ట్రంలో ఉదృతంగా సాగుతున్నది.  తమ డిమాండ్లు నెరవేరే వరకు సమ్మె విరమించేది లేదని తెగేసి చెప్తున్నారు కార్మికులు.  సమ్మె సమ్మెను ఉదృతం చేస్తామని అంటున్నారు.  అటు ముఖ్యమంత్రి కెసిఆర్ దీనిపై ఆర్టీసీ అధికారులు, రవాణాశాఖ మంత్రితో చర్చలు జరిగిపారు.  ఈ సమావేశంలో హైకోర్టు ఆదేశిస్తే చర్చలు జరుపుతామని అంటున్నారు.  అయితే, ఇప్పటికే హై కోర్టు చర్చలు జరపాలని ఆదేశించింది. ప్రజలకు ఇబ్బందులు కలిగించకూడదనే పేర్కొన్నది.  


సమ్మె విరమించేది లేదని, సమ్మె చేస్తూనే చర్చలకు పిలిస్తే వస్తామని, తమ ప్రధానమైన డిమాండ్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం.  ఆ డిమాండ్ నెరవేరేవరకు సమ్మె విరమించేది లేదని అంటున్నారు.  కానీ, అది మేనిఫెస్టోలో లేదని, ఒకవేళ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తే.. మిగతా కార్పొరేషన్లు కూడా ప్రభుత్వంలో విలీనం చేయాలని పట్టుబట్టే అవకాశం ఉందని ప్రభుత్వం చెప్తున్నది.  


కానీ, హైకోర్టు మాత్రం ప్రజల విషయాలు ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అంటూ మొట్టికాయలు వేస్తున్నది.  ప్రభుత్వం విషయంలో అలసత్వం ప్రదర్శిస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేసింది.  ఇతర రాష్ట్రాల్లో రవాణా వ్యవస్థ మెరుగ్గా ఉందని అందుకే అక్కడకు పెట్టుబడులు వస్తున్నాయని, ఇక్కడ అలా జరగకపోవడానికి కారణం ఏంటిని ప్రశ్నించింది.  దీంతో ప్రభుత్వం ఇరకాటంలో పడింది.  


అంతేకాదు, ఆర్టీసీకి మద్దతుగా ఇప్పటికే ప్రజాసంఘాలు, ఉద్యోగ సంఘాలు మద్దతు తెలుపుతున్నాయి.  త్వరలోనే విద్యార్థి సంఘాలు కూడా మద్దతు తెలిపే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈనెల 19 వ తేదీన తెలంగాణ బంద్ కు ఆర్టీసీ జేఏసీ పిలుపును ఇచ్చింది. ఇదిలా ఉంటె, రేపటిలోగా కార్మికులతో చర్చలు జరిపి ప్రభుత్వం హైకోర్టుకు నివేదిక ఇవ్వాలి.  మరి ప్రభుత్వం కార్మికులను చర్చలకు పీలుస్తుందా లేదా అన్నది తెలియాలి.  ఈరోజు కెసిఆర్ గారు హుజూర్ నగర్ ప్రచారంలో పాల్గొనబోతున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: