ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత దేశం ఒకటి.  భారత దేశం ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో ప్రపంచం గుర్తిస్తూనే ఉన్నది.  అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడుతున్నది.  విద్య, విజ్ఞానం, పరిశోధన, వైద్యం ఇలా ఏవి తీసుకున్నా పరుగులు తీస్తున్నది. అంతేకాదు, ప్రపంచానికి ఇప్పడు భారత్ ఒక గొప్ప మార్కెట్ గా మారింది.  అందుకే ప్రతి దేశం కూడా ఇండియాతో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవడానికి చూస్తున్నాయి.  ప్రపంచంలోనే అత్యధిక జనాభాకలిగిన దేశంలో ఇండియా రెండో స్థానంలో ఉన్నది.  


ఇది ఒకకారణం కావొచ్చు.  టెక్నాలజీ రంగంలో ఇండియా దూసుకుపోతుండటంతో.. ఒకప్పటిలా కాకుండా ఇప్పుడు డబ్బు సంపాదన అన్నది ఈజీ అయ్యింది.  దీంతో ఇండియా డబ్బు సంపాదనకు ఒక మార్గదేశంగా ఉన్నది.  ఇప్పుడు ఇండియాలో అన్ని సదుపాయాలు దొరుకుతున్నాయి.  పేదరికం సగానికి తగ్గిపోయినట్టు ప్రపంచబ్యాంక్ ఇటీవలే నివేదికలో పేర్కొన్నది.  మరికొన్ని సంవత్సరాల్లో ఈ సంఖ్య మరింత తక్కువగా ఉండబోతుందని.. ఇండియా చేస్తున్న కృషికి మెచ్చుకున్నది ప్రపంచబ్యాంక్.  


అయితే, ఇప్పుడు ఇండియాకు మరో షాక్ తగిలింది.  ప్రపంచంలో ఆకలితో అల్లాడుతున్న ప్రజల్లో ఎక్కువగా ఇండియాలోనే ఉన్నారని, 116 దేశాల నివేదికలో ఇండియా 102 వ స్థానములో ఉన్నట్టుగా తెలుస్తోంది.  ఇండియా కంటే పాకిస్తాన్, బాంగ్లాదేశ్, శ్రీలంక దేశాలు మెరుగ్గా ఉన్నట్టు ఆ నివేదిక తెలియజేసింది.  అయితే, ఇండియాలో జనాభా అధికంగా ఉండటం వలన ఇలా ఆకలి కూడా పెరిగిపోతున్నది.  ఇప్పుడు ప్రభుత్వం ముందు పెను సవాల్ ఉన్నది.  


ఒకవైపు దేశాన్ని వేగంగా అభివృద్ధి పథంలో నడిపిస్తూనే.. మరోవైపు జనాభానుకంట్రోల్ చేస్తూ.. ఆకలి నుంచి భారత దేశాన్ని రక్షించడం.  ప్రతి ఒక్కరికి పోషకాహారం అందేలా చూడటం.  ఇది చాలా అవసరం. అందుకే ప్రతి ఒక్కరు ఈ దేశం నాది అని భావించి ఆకలి నుంచి రక్షించేందుకు తగిన విధంగా చర్యలు తీసుకోవాలి.  అప్పుడే దేశం అన్ని రకాలుగా ముందుకు నడుస్తుంది.  అన్ని రకాలుగా ఇబ్బందుల నుంచి బయటపడుతుంది.  మరి చూద్దాం ఏమౌతుందో.  


మరింత సమాచారం తెలుసుకోండి: