మనిషి విజ్ఞాన పరిధి ఎప్పటికప్పుడు పెరిగిపోతున్నది. ఈ విజ్ఞానం విశ్వాన్ని చేధిస్తుంటే, భవిష్యత్ తరాల కోసం ఎంతో ఉన్నతంగా ఆలోచిస్తున్నామని అనుకుంటున్నాం. కాని మనిషి ఏది కనిపెట్టిన అది వారి పతాననికె ఏదో ఒకరోజు ఉపయోగపడుతుందని గ్రహించలేక పోతున్నాడు. ఇకపోతే మనిషి జీవించడానికి ఇప్పటి వరకు భూమి ఒక్కటే  ఆవాసయోగ్యంగా ఉన్నది. అందుకోసం మరోచోట నివాసానికి అనువైన ప్రదేశం కోసం వెతికే పనిలో పడ్డాడు. అందులో భాగంగా  భవిష్యత్తులో చంద్రుడుపై, అంగారకుడిపై ఆవాసం ఏర్పాటు చేసుకునే దిశగా పరిశోధనలు చేస్తున్నారు. 


ఒకవేళ మనిషి చంద్రునిపై ఆవాసం ఏర్పాటు చేసుకోవాలి అంటే అక్కడ ఆహారం అవసరం ఉంటుంది.  భూమిపై నుంచి ఆహారాన్ని చంద్రునిపైకి తీసుకెళ్లడం అంటే మామూలు విషయం కాదు. అందుకే అక్కడే పంటలు పండించే విషయంలో పరిశోధనలు చేస్తున్నారు శాస్త్రవేత్తలు. అందుకోసం చంద్రునిపైన, అంగారకుడిపైన  కృత్రిమ వాతావరణాన్ని సృష్టించగా విచిత్రంగా అక్కడ పదిరకాల మొక్కలు మొలిచాయట. వాటి నుంచి కాయగూరలు కూడా వచ్చాయట.  ఇందులో పాలకూర మాత్రం అనుకున్నంతగా పెరగలేదు.  కాని పాలకూర మినహా మిగతా కాయకూరలు మంచిగా పండాయి. 


అయితే, వీటి నుంచి వచ్చిన విత్తనాలను తిరిగి నాటితే వాటిల్లో కొన్ని మాత్రమే మొలకెత్తాయి.  ప్రస్తుతం దీనిపై పరిశోధన చేస్తున్నారు. ఇకపోతే 2028 నాటికి చంద్రునిపై నివాసం ఏర్పాటు చేసుకునే దిశగా నాసా పరిశోధనలు మొదలు పెట్టింది. ఇకపోతే చంద్రుని మీద ఇలాంటి జీవ సంబంధమైన పరిణామం చూడటం ఇదే తొలిసారి. దీంతో అంతరిక్షంలో మరింత విస్తృతమైన పరిశోధనలు జరిపేందుకు కీలక అడుగు పడినట్లేనని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతుండగా, గతంలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో మొక్కలు పెరిగాయి. కానీ, చంద్రుని మీద విత్తనాలు మొలకెత్తడం మాత్రం ఇదే తొలిసారి అని ఈ తాజా పరిశోధన మున్ముందు ప్రయోగాలు చేసేందుకు ఉపయోగ పడుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు...


మరింత సమాచారం తెలుసుకోండి: