తెలంగాణాలో గడచిన 12 రోజులుగా జరుగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె కొన్ని సంచనలనాకు కారణమవుతోంది. మొన్నటి వరకూ ఏపిలో కెసియార్ పరిపాలన గురించి మాట్లాడుకునే వారు. కానీ ఇపుడు ఆర్టీసీ సమ్మె పుణ్యమా అని తెలంగాణాలో కూడా జగనే సిఎంగా ఉంటే బాగుంటుందని అనుకోవటం మొదలైంది.

 

దాదాపు నెల రోజుల క్రితం ఏపిలోని 53 వేలమంది ఆర్టీసీ కార్మికులను, ఉద్యోగులను జగన్ ప్రభుత్వంలో విలీనం చేసేశారు. అలాగే వారి ఉద్యోగ విరమణను కూడా 58 ఏళ్ళ నుండి 60కి పెంచారు.  నిజానికి ఆర్టీసీనే ప్రభుత్వంలో విలీనం చేద్దామని అనుకున్నారు కానీ సాంకేతిక కారణాల వల్ల సాధ్యం కాలేదు.

 

సీన్ కట్ చేస్తే అదే డిమాండ్ పై తెలంగాణాలో ఆర్టీసీ కార్మికులు సమ్మె మొదలుపెట్టారు. అయితే కార్మిక సంఘ నేతలతో సామరస్యంగా మాట్లాడాల్సిన కెసియార్ నోటికొచ్చింది మాట్లాడేసి విషయాన్ని కంపు చేసుకున్నారు. దాంతో గోటితో పోయే సమస్యను గొడ్డలిదాకా తెచ్చుకున్నట్లైంది. దాంతో ఆర్టీసీ కార్మికులతో పాటు వాళ్ళ కుటుంబాలు కూడా తెలంగాణాలో సిఎంగా జగన్ ఉంటే బుగుండేదని బహిరంగంగానే అంటున్నారు. దాంతో కెసియార్ కు మండిపోతోంది.

 

అలాగే గ్రామ వాలంటీర్లు, గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగాలను జగన్ భర్తీ చేశారు. అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే సుమారు 4 లక్షల ఉద్యోగాలను భర్తీ చేశారు. ఇదే విషయమై తెలంగాణాలోని నిరుద్యోగులు మాట్లాడుతూ తెలంగాణాలో కూడా జగనే సిఎంగా ఉండుంటే తమకు కూడా ఉద్యోగాలు వచ్చుండేదంటున్నారు.  కెసియార్ సిఎంగా ఐదున్నరేళ్ళు పూర్తి చేసుకున్నా ఉద్యోగాల కల్పన చేయకపోవటం గమనార్హం.

 

 ఇక చివరగా  తెలంగాణాలోని కౌలు రైతులు కూడా డిమాండ్లు మొదలుపెట్టారు.  ఏపిలో రైతు భరోసా పథకంలో భాగంగా కౌలు రైతులకు కూడా ఏడాదికి రూ. 13500 పెట్టుబడి సాయం క్రింద ఇస్తున్న విషయం తెలిసిందే. గతంలో ఏ ప్రభుత్వం కూడా కౌలు రైతులను ఏ విధంగా కూడా గుర్తించలేదు. అలాంటిది జగన్ లక్షలాది కౌలు రైతులను గుర్తించారు. దాంతో తమకు కూడా కెసియార్ పెట్టుబడి సాయం క్రింద డబ్బులు ఇవ్వాలంటూ డిమాండ్ మొదలుపెట్టారు. చూశారుగా తెలంగాణాలో కూడా జగన్ క్రేజ్ ఎలా పెరుగుతోందో.


మరింత సమాచారం తెలుసుకోండి: