తెలుగురాష్ట్రాల్లో మీడియా విచిత్రమైన పరిస్ధితిని ఎదుర్కొంటోంది. దశాబ్దాల మీడియా చరిత్రలో 1995 తర్వాత నుండి మాత్రమే మీడియా వైఖరిపై ఎక్కువగా  ఆరోపణలు మొదలయ్యాయి. నిష్పక్షపాతంగా ఉండాల్సిన మీడియా హద్దులు దాటి ప్రవర్తించటమే ఇందుకు కారణం. అలాంటి హద్దులు దాటటమన్నది గడచిన ఐదేళ్ళుగా ఆకాశమే హద్దుగా చెలరేగిపోయింది. అందుకనే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీడియా అతికి స్పీడు బ్రేకులు వేయాలని డిసైడ్ అయ్యింది.

 

తాజాగా జరిగిన క్యాబినెట్ సమావేశంలో మీడియా వ్యవహారాలపై పెద్ద చర్చే జరిగింది. ప్రభుత్వంపై ఉద్దేశ్యపూర్వకంగా తప్పుడు వార్తలు ప్రచురించటం, ప్రసారాలు చేయటం, నిరాధార కథనాలతో జనాలను తప్పుదోవ పట్టించటం చేస్తే ఇకనుండి సదరు మీడియాకు మూడినట్లే. అసత్య కథనాలపై వెంటనే కోర్టులో కేసులు వేయటం, శిక్షపడేట్లు చర్యలు తీసుకోవాలని మంత్రివర్గం డిసైడ్ చేసింది.

 

అసలు మీడియా విషయంలో ప్రభుత్వం ఇటువంటి వైఖరి అవలంభించటానికి ప్రధాన కారణం మీడియా చేస్తున్న అతి అనే చెప్పాలి.  తెలుగుదేశంపార్టీ పెట్టినపుడు కూడా ఈనాడు దినపత్రిక ఏకపక్షంగా ఎన్టీయార్ కు మద్దతు పలికింది. అయితే అప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వంపై విసిగిపోయున్న జనాలు ఈనాడు వైఖరిని ఎక్కడా తప్పు పట్టలేదు.

 

అయితే స్వేచ్చ ముసుగులో మీడియా పైత్యం పెరిగిపోయింది మాత్రం 1995లో ఎన్టీయార్ కు చంద్రబాబు వెన్నుపోటు వ్యవహరంతోనే అని చెప్పాలి. తాను సిఎం అవటానికి చంద్రబాబు మీడియా మద్దతు కోసం అడ్డదారులు తొక్కారు. దాంతో మెజారిటి మీడియా చంద్రబాబు కనుసన్నల్లో పనిచేయటం మొదలైంది. అప్పటి నుండే మీడియా స్వేచ్చ అంటే కేవలం యజమానుల స్వేచ్చగా మారిపోయింది.

 

చంద్రబాబు గుడ్ లుక్స్ లో ఉండేందుకు మెజారిటి మీడియా కాంగ్రెస్ ను ప్రధానంగా వైఎస్సార్ కు వ్యతిరేకంగా కథనాలు వండివార్చటం మొదలైంది. అప్పుడు మొదలైన అతి జగన్మోహన్ రెడ్డి హయాంలో  పీక్స్ కు చేరుకుంది. ఏ మీడియా అయినా సొంతబుద్ధితో ఒకిరికి వ్యతిరేకంగా కథనాలు రాసినా, లేదా మద్దతిచ్చినా రెండో వాళ్ళకు పెద్దగా ఇబ్బందులు ఉండదు. అదే చంద్రబాబు కోసమే జగన్ ను గబ్బుపట్టించాలన్న ఉద్దేశ్యంతోనే మెజారిటి మీడియా కథనాలు ప్రచురిస్తుండటమే సమస్యగా మారింది.

 

చంద్రబాబుకు మద్దతుగా జగన్ కు వ్యతిరేకంగా ఎల్లోమీడియా పనికట్టుకుని ఏ స్ధాయిలో రెచ్చిపోతున్నదో అందరూ చూస్తున్నదే. మీడియి స్వేచ్చ ముసుగులో ఎల్లోమీడియా అతిని నియంత్రించేందుకే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. ఈ పరిస్దితి తెచ్చుకున్నందుకు నిజంగా మీడియానే సిగ్గు పడాలి

 

.


మరింత సమాచారం తెలుసుకోండి: