హరిద్వార్ లో చేతిలో గన్స్ పట్టుకుని ఓ వ్యక్తి డ్యాన్స్ చేస్తున్న వీడియో వైరల్ కావడంతో ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. ఈ వీడియోలో ఆ వ్యక్తి రెండు చేతులతో గన్స్ పట్టుకుని హిందీ పాటకు డ్యాన్స్ చేస్తూ కనిపించారు. ఈ వీడియోను పరిశీలించగా ఒక ఇంటిలో ఇదంతా సాగినట్టు తెలుస్తుంది. ఇది ఎప్పుడు, ఎక్కడ ఏ ప్రాంతంలో జరిగిందనేది మాత్రం ఇంకా తెలియలేదు. అసలు ఈ వీడియోలో కనిపించిన వ్యక్తి ఎవరు? ఈ ఘటన ఎప్పుడు జరిగింది అనే సంగతి తెలుసుకోటానికి, దర్యాప్తు చెప్పట్టామని హరిద్వార్ సర్కిల్ ఆఫీసర్ అభయ్ సింగ్ మీడియాకి వివరించారు.
ఆ వీడియోలో ఉన్న వ్యక్తిని అరెస్ట్ చేసి తగిన చర్యలు చేపడతామని చెప్పారు. ఈ ఘటన హరిద్వార్‌లో జరిగిందా లేక మరెక్కడైనా జరిగిందా అన్నది ఇంకా కనిపెట్టాలి అని కూడా తెలిపారు అభయ్ సింగ్. మొన్న ఈ మధ్య కూడా ఇలాంటి సంఘటన చోటుచేసుకుంది. ఈ ఏడాది జులైలో, మద్యం మత్తులో బీజేపీ ఎమ్మెల్యే ప్రణవ్ సింగ్ ఛాంపియన్ చేసిన డ్యాన్సు వీడియో చాలా వైరల్‌గా మారింది. ఉత్తరాఖండ్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే ప్రణవ్‌సింగ్ మద్యం మత్తులో ఒకచేతిలో తుపాకి, మరో చేతిలో మందు గ్లాసు పట్టుకుని బాలీవుడ్ పాటలకు చిందులేస్తూ, డ్యాన్స్ చేసిన మూడు నిమిషాల వీడియో బయటకు రావటంతో పెద్ద వివాదం నెలకొన్న సంగతి అందరికి తెలిసిన విషయమే.
ఓ జర్నలిస్ట్‌ను బెదిరించిన కారణంగా ఆయనను అప్పటికే బీజేపీ నుంచి మూడు నెలల పాటు ఉత్తరాఖండ్ పార్టీ కమిటీ బహిష్కరించారు. తాజా వీడియో విషయంపై పార్టీ నేతలు అతనిపై తగిన చర్యలు ఉత్తరాఖండ్ రాజ్యసభ ఎంపీ
అనిల్ బాలుని తీసుకున్న సంగతి తెలిపారు.
అయినా కానీ బీజేపీ ఎమ్మెల్యే ప్రణవ్‌సింగ్, తాను ఎలాంటి బెదిరింపులకు లొంగనని, మద్యం తాగడం మరియు లైసెన్స్ గన్స్ కలిగివుండటం తప్పా అని ప్రశ్నించారు. ప్రస్తుతం గన్స్‌తో చిందులు వేసిన వ్యక్తిని కనిపెట్టి, విచారణ అనంతరం అతనికి చిక్కులు తప్పవు అంటున్నారు పోలీస్ అధికారులు.