తమిళనాడు ,తిరువొత్తియూరులో సేలం  ప్రభుత్వ  పాఠశాలలో జరిగిన ఈ ఘటన అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఓ విద్యార్థి తన పుట్టినరోజు సందర్భముగా తన స్నేహితులతో  కలిసి తన బర్త్‌డే సెలబ్రేషన్స్‌ను మద్యంతో జరుపుకుంది. ఈ  విషయం తెలిసిన ఉపాధ్యాయిని ఆ విద్యార్థిని మందలించారు. దీంతో  తీవ్ర మనస్తాపం చెందిన బాలిక ఆత్మహత్య చేసుకుంది.

సేలం ప్రభుత్వ పాఠశాలలో ఈ  ఘటన చోటుచేసుకుంది . పోలీసుల వివరాలు  ప్రకారం, సేలం ఇడైపట్టి జోన్‌కు చెందిన ప్రభుత్వ బాలికల మహోన్నత పాఠశాలలో  దాదాపు 1,500 మంది బాలికలు చదువుతున్నారు.మంగళవారం ఉదయం స్కూల్‌లో అబ్దుల్ కలాం జయంతిని నిర్వహించగా , ప్లస్ టు చదువుతున్న ఓ విద్యార్థిని బర్త్‌డే కూడా అదే రోజు కావడంతో తన ఐదుగురు స్నేహితులతో కలిసి వాళ్ళ  తరగతి గదిలో బర్త్‌డే సెలబ్రేట్ చేసుకున్నారు. 

ఆమెతో కేక్ కట్ చేయించి,సెల్ఫీలు, వీడియోలు తీసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. అదే సమయంలో తరగతి గదిలోకి వచ్చిన ఉపాధ్యాయిని వారి చేతుల్లోని బీర్ బాటిళ్లు చూసి ఆగ్రహం వ్యక్తం చేసారు. వారి తల్లిదండ్రులను పిలిపించి వారి ఎదుటే విద్యార్థులను మందలించారు. ఈ క్రమంలో, తల్లిదండ్రుల ఎదుట ఉపాధ్యాయుడు మందలించడంతో తీవ్ర మనస్తాపం చెందిన ఓ విద్యార్థిని తల్లిదండ్రులతో కలిసి ఇంటికి వెళ్లిన వెంటనే,ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అయితే, ఈ విషయాన్ని ఆమె తల్లిదండ్రులు ఎవరికీ చెప్పకుండా దాచి,కుమార్తె మృతదేహాన్ని  దహనం చేయటంతో విషయం వివాదాస్పదమైంది.

ప్రస్తుతం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటన ఆ ప్రాంతంలో తీవ్ర  సంచలనం సృష్టించింది. దీనిపై జిల్లా ముఖ్య విద్యాధికారి విచారణ చెప్పటమని పోలీస్ శాఖవాళ్ళకి ఆదేశించారు. అసలు ప్రభుత్వ పాఠశాలలో బర్త్‌డే వేడుకలు ఏంటి? అదికూడా మద్యంతో, అనే విషయంపై తల్లితండ్రులు విద్యా  వ్యవస్థపై  తీవ్రగా విమర్శలు చెలరేగుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: