సైబర్ నేరాల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది. ప్రమేయం లేకుండానే బ్యాంకుల్లోని తమ ఖాతాల్లో డబ్బు మాయమైపోతున్న ఘటనలు పెరిగిపోతోంది.  దాంతో ఖాతాదారులంతా లబోదిబో మంటున్నారు. ఇటువంటి నేపధ్యంలోనే ఖాతాదారులకు భరోసా ఇచ్చేందుకు, ఊరట కలిగించేందుకు సైబర్ క్రైం పోలీసులు తాజాగా ఓ ప్రకటన చేశారు.

 

ఇంతకీ అదేమిటంటే ఖాతాదారుల ప్రమేయం లేకుండానే ఖాతాల్లో నుండి మాయమైన డబ్బును తిరిగి ఖాతాదారునికి చెల్లించాల్సిన బాధ్యత సదరు బ్యాంకుపైనే ఉందట. ఖాతాల్లో నుండి డబ్బు మాయమవ్వటమే కాకుండా ఏటిఎంల నుండి కూడా కేటుగాళ్ళు డబ్బులు ఎత్తేస్తున్నారు. పెరిగిపోతున్న  సాంకేతిక నైపుణ్యం పుణ్యమా అని నేరాల కూడా అదే  స్ధాయిలో పెరిగిపోతున్నాయి.

 

ఇక్కడ విచిత్రమేమిటంటే సాంకేతిక ఫలాలు సామాన్య జనాలకు అందుబాటులోకి రాకుండానే నేరగాళ్ళు తెలివి మీరిపోతున్నారు. దాంతో టెక్నాలజీ మామూలు జనాలకు పెద్ద సమస్యగా మారిపోయింది.  ఓ ఉద్యోగి ఖాతాలో నెల జీతం పడగానే గంటల వ్యవధిలోనే మొత్తం డబ్బు మాయమైపోయిందంటే అర్ధమేంటి ?  

 

తమ ఖాతాలో నుండి డబ్బు మాయమైపోయిందని గుర్తించగానే ముందుగా చేయాల్సిన పనేమిటంటే బ్యాంకు మేనేజర్ ను కలిసి రాత పూర్వకంగా  ఫిర్యాదు చేయటం. తర్వాత అదే విషయాన్ని సైబర్ క్రైం పోలీసులకు కూడా ఫిర్యాదు చేయాలి. వాళ్ళ దగ్గర నుండి మీరు కంప్లైంట్ చేసినట్లు ఆధారాలు తీసుకోవాలి.

 

అదే సమయంలో ఖాతాలో నుండి డబ్బులు మాయమయ్యే ముందు ఉన్న డబ్బులు ఎంత ? డబ్బులు మాయమైపోయిన తర్వాత ఖాతాలో ఉన్న డబ్బెంత ? అన్న విషయాన్ని స్టేట్మెంట్ రూపంలో పోలీసు కంప్లైంట్ తో సహా  బ్యాంకుకు ఫిర్యాదు చేయాలి.  దానిపై బ్యాంకులు విచారణ చేసి ఫిర్యాదు నిజమే అని నిర్ధారించుకుంటే అప్పుడు మాయమైన డబ్బు మొత్తాన్ని మీ ఖాతాలో జమచేస్తుంది.

 

బ్యాంకులో డబ్బులు దాచుకున్నందుకు దాన్ని సంరక్షించాల్సిన బాధ్యత బ్యాంకుదే అన్న విషయం మనం గుర్తుంచుకోవాలి. కాబట్టి ఖాతాలో డబ్బు పోయిందని బాధపడకుండా పైన చెప్పిన పనులు చేయండి. డబ్బు కచ్చింతంగా వచ్చి తీరుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: