బిసిసిఐ అధ్యక్షుడిగా క్రికెట్ దిగ్గజం గంగూలి ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. కాగా ఈ నెల 23న కొత్త అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు గంగూలి. అయితే క్రికెట్లో అపార అనుభవం ఉన్న గంగూలి ఎన్నో ఏళ్ళు భారత టీం తరఫున ఎన్నో విజయాల్లో పాలుపంచుకున్నారు. తనదైన ఆటతో దేశంలో క్రికెట్ కి ఓ మంచి క్రేజ్ తీసుకొచ్చారు గంగూలీ . అయితే గంగూలి బిసిసిఐ అధ్యక్షుడిగా నియమించబడటంతో ... భారత క్రికెట్ లో సమూల మార్పులు చోటుచేసుకునే అవకాశాలు ఉన్నాయని సమాచారం. అయితే చాలా రోజుల నుండి ధోని తన  స్థాయికి తగ్గ ఆటను ప్రదర్శించ లేక  పోవడం... ప్రపంచ కప్ లో  సైతం పేలవ ప్రదర్శన చేయడంతో ధోనీ రిటైర్మెంట్ పై ఎన్నో రోజులనుండి ఊహాగానాలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటివరకు ధోనీ రిటైర్మెంట్ ప్రకటించిన లేదు అటు బిసి అధికారులు కూడా ధోనిపై ఎలాంటి వేటు వేయలేదు. 

 

 

 

 

 అయితే బిసిసిఐ నూతన అధ్యక్షుడిగా క్రికెట్ దిగ్గజం గంగూలీ  బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ విషయంలో సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారని  వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ధోని భవిష్యత్తు గురించి మీడియా సమావేశంలో మాట్లాడారు గంగూలి. ఈ నెల 24న కలెక్టర్లతో తాను భేటీ కానున్నానని  ఆయన చెప్పారు. అయితే ఈ సమావేశంలో ధోని గురించి బిసిసిఐ సెలెక్టర్ అభిప్రాయాన్ని తెలుసుకోవడమే కాకుండా... ధోని తో కూడా మాట్లాడతానని గంగూలి తెలిపారు. అయితే సమావేశం అనంతరం ధోని విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో నిర్ణయిస్తామని గంగూలీ తెలిపారు. 

 

 

 

 

 కాగా ఈ సమావేశంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా పాల్గొననున్నాడు. అయితే మరోవైపు మారిన నిబంధనల వల్ల టీమ్ ఇండియా కోచ్ రవిశాస్త్రి ఈ సమావేశానికి అందుబాటులో ఉండకపోవచ్చు అని తెలిపారు. అయితే గంగోలి బిసిసిఐ నూతన అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో అటు టీం ఇండియా కోచ్ రవిశాస్త్రి కి  కూడా ఇబ్బందులు తప్పవని వార్తలు వస్తున్నాయి. అయితే ధోని గురించి ఎన్నో  రోజుల నుండి రిటైర్మెంట్ ఊహాగానాలు వస్తున్నప్పటికీ అటు బిసి అధికారులు కానీ  అతని రిటైర్మెంట్ పై ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అంతేకాకుండా ప్రపంచ కప్ లో  సైతం ధోనీకి అవకాశం కల్పించారు బిసిసిఐ సెలెక్టర్లు. కానీ ప్రపంచ కప్ లో కూడా పేలవ ప్రదర్శన చేశాడు ధోనీ. తన స్థాయిలో  ధోని ఆట కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో నూతన అధ్యక్షుడిగా ఎంపికైన గంగూలీ మాత్రం ధోని కి చెక్ పెడతాడని వార్తలు కూడా వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: