రోజు రోజుకి వైద్యుల నిర్లక్ష్యంతో చాల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి సంఘటనే ప్రస్తుతం తెలంగాణా రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా కేతిరెడ్డిపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం లో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో నిర్లక్ష్యంతో మహిళా మృతి చెందింది. కేతిరెడ్డి పల్లి గ్రామానికి చెందిన గృహిణి మంజుల అనారోగ్యం కారణంతో మొయినాబాద్ లోని భాస్కర్ ఆసుపత్రిలో అడ్మిట్ అయింది. అయితే అక్కడ వైద్య సిబ్బంది ఆమెకు అవసరమైన వైద్యచికిత్స అందించకపోవడంతో మృతి చందడం జరిగింది. బుధవారం సాయంత్రం ఆరు గంటలకు మంజులను ఆమె బంధువులు ఆసుపత్రిలో జాయిన్ చేశారు. 


అయితే రాత్రి విధులు నిర్వహిస్తున్న వైద్య సిబ్బంది బాధితురాలిని పట్టించుకోకపోవడంతో ఆమె అర్ధరాత్రి రెండు గంటలకు చనిపోవడం జరిగింది. మృతురాలు వయస్సు ముప్పై సంవత్సరాలు. అగ్రహించిన బంధువులు ఆసుపత్రి ఎదుట అందలోనా వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం చెయ్యాలని డిమాండ్ చేస్తున్నారు. మృతురాలు మంజులకు ఇద్దరు కుమారులు వున్నారు. మంజుల భర్త చాలాకాలం ముందే చనిపోయారు. ఇప్పుడు మంజుల కూడా చనిపోవడంతో ఇద్దరు పిల్లలు అనాథలైయ్యారు. ఈ ఘటన అక్కడ ఉన్న వారిని కలిచివేసింది.  


 ఆమెని ఆసుపత్రిలో చేర్చినప్పటినుంచి కూడా ఎవరు కూడా ఆమెను అటెండ్ చెయ్యలేదు, వైద్యులు ఎవరుకూడా పట్టించుకోలేదు. ఆమెకు అనారోగ్యనికి గురయింది అని చెప్పినవుప్పటికీ కూడా ఎవ్వరు పట్టించుకోకపోవడం వల్లనే ఆమెకి సరైన చికిత్స చెయ్యకపోవడం వల్లనే ఆమె మృతి చేయండడానికి కారణం అంటూ ఆ మృతురాలి బంధువులు అందరుకూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మృతురాలికి ఇద్దరు చిన్న పిల్లలు వున్నారు.


కొన్నాళ్ల క్రితమే మృతురాలి భర్త కూడా మృతిచెందాడు. ఇప్పుడు వైద్యుల నిర్లక్ష్యంతోనే మంజుల మృతిచెందడంతో ఇద్దరు చిన్నారులు అనాథలైపోయారంటూ బంధువులు అందరుకూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భాస్కర్ ఆసుపత్రి మెడికల్ కాలేజ్ పైకూడా గతంలో అనేక ఆరోపణలున్నాయి. తనిఖీలప్పుడే అద్దెకు రోగులని తీసుకువస్తారు. తప్పించి అక్కడ సరైన వైద్య సదుపాయాలు ఉండవంటూ అనేక ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో నిన్న ఈ జరిగిన ఘటనతో కొంత నిన్న ఏ ఘటన చోటుచేసుకుంది. క్లీయర్ గా ఇందులో డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగానే మంజుల మృతిచెందింది. 


కాబట్టి భాస్కర్ ఆసుపత్రి యజమాన్యంపైన అక్కడ విధి నిర్వహణలో వున్న వైద్యులపైనా కఠిన చర్యలు తీస్కోవాలంటూ మృతురాలి బంధువులందరూ కూడా అందోళనకు దిగారు. ప్రస్తుతం ఇంకా మృతదేహాన్ని ఆసుపత్రి వద్దనే ఉంచి  బంధువులు ఇంకా ఆందోళన కొనసాగిస్తున్న పరిస్తతి అయితే ఇక్కడ ఉంది.



మరింత సమాచారం తెలుసుకోండి: