పాకిస్తాన్ ఇండియాపై ఎప్పుడెప్పుడు బురద జల్లాలా అని ఆలోచిస్తుంది.  అవకాశం లేకున్నా సరే సందుచేసుకొని బురద జల్లేందుకు సిద్ధం అవుతుంది.  చివరకు అభాసుపాలవుతుంది.  గతంలో పాకిస్తాన్ కులభూషణ్ జాదవ్ విషయంలో కూడా అలానే కేసు పెట్టి ఉగ్రవాదిగా ముద్రవేసి మరణశిక్ష విధించింది.  అయితే, ఈ కుట్రను తెలుసుకున్న ఇండియా అంతర్జాతీయ న్యాయస్థానంలో కేసు ఫైల్ చేయడంతో ఉరిశిక్షను రద్దు చేసింది.  ఇరాన్ లో వ్యాపారం చేసుకుంటున్న మాజీ సైనికాధికారికి ఉగ్రవాది పేరుతో ఇరాన్ నుంచి అపహరించి అతనిపై నేరం మోపింది.  


ఆ తరువాత చెన్నై కు చెందిన వేణు మాధవ్ అనే ఇంజనీర్ ను కూడా అలాగే ఉగ్రవాదిగా చిత్రీకరించాలని చూసింది.  ఈ విషయాన్ని పసిగట్టిన ఇండియా వేణు మాధవ్ ను ఇండియాకు తీసుకొచ్చింది.  పెషావర్ సైనిక స్కూల్ లో ఉగ్రవాదుల దాడికి వేణు మాధవ్ కారణం అని చెప్తూ అతన్ని ఆఫ్గనిస్తాన్ నుంచి అపహరించే ప్రయత్నం చేసింది. కానీ, ఇండియా ముందుగానే రియాక్ట్ అయ్యి అతడిని అక్కడి నుంచి తప్పించింది.  


పెషావర్ సైనిక స్కూల్ పై దాడులు జరిగిన సమయంలో వేణు మాధవ్ ఇండియాలోనే ఉన్నాడు.  చెన్నైలో జాబ్ చేస్తున్నాడు.  ఈ విషయం తెలియకుండా ఆయన్ను అపహరించాలి చూసి భంగపడింది పాకిస్తాన్.  కాగా, ఇప్పుడు మరో కుట్రను ప్లాన్ చేసింది.  అబుదాబిలో 2016 నుంచి 2018 వరకు అజయ్ మిస్త్రీ అనే వ్యక్తి చెఫ్ గా పనిచేసేందుకు వెళ్ళాడు.  రెండేళ్లు అక్కడ పనిచేశారు.  


అజయ్ మిస్త్రీని ఉగ్రవాదిగా చిత్రీకరించేందుకు పాక్ ప్లాన్ చేసింది.  1267 తీర్మానం ద్వారా ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ఆరోపణలు చేసింది.  అయితే, డైరెక్ట్ గా పాక్ ఈ ప్రతిపాదనను తీసుకురాలేదు కాబట్టి, చైనా సహాయంతో ఈ ఆరోపణలు చేసింది.  చైనా ఈ ప్రతిపాదనను భద్రమండలిలో ప్రతిపాదించింది.  సిరియా, ఇరాక్ నుంచి ఉగ్రవాదలు ఆఫ్ఘనిస్థాన్ కు సురక్షితంగా చేరే విధంగా ఈ మిస్త్రీ సహకరిస్తుంటాడనేది పాకిస్తాన్ అభియోగం. పాకిస్తాన్ లోని కాల్యా బజార్, ఓరాజియా, ఖైబర్ ఫక్తూన్ వాలా ప్రాంతాలలో ఉగ్రవాదుల దుశ్చర్యలకు మిస్త్రీ సహకరించాడట. ఈ దాడులలో 31 మంది చనిపోవడానికి మిస్త్రీ కారణమని పాకిస్తాన్ అభియోగం మోపింది.  అయితే, ఈ విషయాలను గమనించిన ఇండియా మిస్త్రీని వెంటనే అబుదాబి నుంచి ఇండియాకు రప్పించింది.  దీంతో పాక్ కుట్ర భగ్నం అయ్యింది.  పాక్ మరో నలుగురిని టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: