ఇటీవలే తెలుగు దేశం పార్టీ, రాజ్యసభ సభ్యులను తమలో విలీనం చేసుకున్నారు. ఆపై ఇప్పుడు కాంగ్రెస్ రాజ్యసభ సభ్యులు  రాజీనామాలు కూడా  చేసారు. ఇంకా తమ పదవి కాలం ఉండగానే, కాంగ్రెస్ తరఫున రాజ్యసభ సభ్యులుగా ఉన్న కొంతమంది  వ్యక్తులు రాజీనామాలు చేస్తున్నారట. ఆ రాజీనామాలతో ఖాళీ అయ్యే స్థానాలను  బీజేపీ వాళ్లు ఆక్రమించే అవకాశాలు చాలా  కనిపిస్తున్నాయి. దీంతో రాజీనామాల పర్వం మొదలయి, మరి కొన్ని రోజులు కొనసాగుతూ వస్తుందని, పేర్కొంటున్నారు సభ్యులు.


మొత్తానికి ఈసారి  శీతాకాల సమావేశాలు మొదలు కాబోయే  సమయానికి, ఇంకొంత మంది  కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు రాజీనామా చేస్తారని తెలుస్తుంది. అలా కాంగ్రెస్ బలగం పెద్దల సభలో మెల్లిగా తరిగిపోతు..... భారతీయ జనతా పార్టీ పెద్ద పార్టీగా నిలుస్తుందన్న విషయం స్పష్టం అవుతుంది. ఎట్టకేలకూ రాజ్యసభలో బీజేపీ మెజారిటీ దిశగా పయనిస్తున్నారని తెలుగు దేశం పార్టీ, రాజ్యసభ సభ్యులు  పేర్కొంటున్నారు.


 ఇప్పటికే అధికారంలోకి వచ్చి ఐదేళ్లు దాటిపోయినా రాజ్యసభలో మాత్రం, బీజేపీకి ఇంకా పట్టు రాలేదు. అక్కడ పరిపూర్ణమైన మెజారిటీ లేదు. ఈ సమయంలో  టీడీపీ ఎంపీల విలీనంతో, బీజేపీ బలం బాగా పెరగనుంది. ప్రస్తుతం ఉన్న కధనాల ప్రకారం.... నామినేటెడ్ ఎంపీలు పోనూ, 243మందిలో ఎన్డీయే వైపు 106 మంది ఎంపీలున్నారు అని తెలుస్తుంది. 

అన్నాడీంఎకే 11 మంది రాజ్యసభ సభ్యులున్నారు. వీరంతా భారతీయ జనతా పార్టీకి అనుకూలమయిన సభ్యులు. పూర్తి మెజారిటీ సంపాదించుకోవాలంటే బీజేపీకి మరి కొంత సమయం పట్టేలానే  ఉంది. కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు 45 మంది ఉన్నారు. అలాంటి వారిలో కొందరు రాజీనామాలు చేయగా, మిగిలిన వారిలో మెజారిటీ బీజేపీ వైపుకు మొగ్గు చూపే అవకాశం చాలానే ఉంది.రాజీనామాల పర్వం మొదలయి, మరి కొన్ని రోజులు ఇలానే  కొనసాగుతూ వస్తే,రాజ్యసభలో భారతీయ జనతా పార్టీ  మెజారిటీ తప్పదు అంటున్నారు రాజకీయ విశ్లేక్షకులు.


మరింత సమాచారం తెలుసుకోండి:

bjp