ఓ వైపు తెలంగాణలో ఆర్టీసీ సమ్మె కొనసాగుతున్న సమయంలో ఓలా, ఊబర్ క్యాబ్ డ్రైవర్లు ప్రయాణికులకు మరో షాక్ ఇవ్వబోతున్నారు అని సమాచారం. ఓలా, ఊబర్, వివిధ ఐటీ కంపెనీలలో పనిచేస్తున్న క్యాబ్ డ్రైవర్లు అక్టోబర్-19, 2019 నుంచి నిరవధిక నిరాహార దీక్షకు సిద్ధం అయ్యారు. వివిధ డిమాండ్లతో వారు సమ్మెకు దిగుతున్నారు.


దాదాపు 50వేల క్యాబ్ లో ఈ సమ్మె కారణంగా నిలిపోనున్నాయి అని అంచనా. ట్రాన్స్ పోర్ట్ డిపార్ట్మెంట్ కి తమ డిమాండ్ల లిస్ట్ ను గతంలో అందించామని తెలంగాణ స్టేట్ ట్యాక్సీ, డ్రైవర్స్ జేఏసీ చైర్మన్ షేక్ సలాలుద్దీన్ తెలియచేసారు. అదేవిధంగా ఊబర్, ఐటీ కంపెనీలకు కూడా డిమాండ్ ల లిస్ట్ ఇచ్చినట్లు సలాలుద్దీన్  తెలియచేసారు.


కిలోమీటరుకు కనీసం 22 రూపాయల ఛార్జీలు వసూలు చేయడం ద్వారా మెరుగైన జీవన పరిస్థితులు, పని ప్రమాణాలను నిర్ధారించడానికి ఉబెర్, ఓలా క్యాబ్‌లు మరియు ఇతర టాక్సీ అగ్రిగేటర్ సేవలను అమలు చేయడం వంటివి వారి డిమాండ్ లతో   సమ్మెలో దిగ్గుతున్నారు ఓలా, ఊబర్ డ్రైవర్లు. డ్రైవర్లందరికీ కనీస వ్యాపార హామీని నిర్ధారించేలా అగ్రిగేటర్ మార్కెట్ ప్రదేశాలకు అనుసంధానించబడిన క్యాబ్‌ల సంఖ్యపై పరిమితి విధించడం వంటివి కూడా  డిమాండ్లలో ఉన్నాయి అని సమాచారం.


ఇక సమ్మెలోకి ఓలా, ఊబర్ డ్రైవర్లు దిగితే ప్రజల పారిస్థితి ఏంటో మరి అర్థం కానీ పరిస్థితుల్లో ఉన్నారు ప్రజలు. ఈ  సమ్మెతో తెలంగాణ సర్కార్ ఏమి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి మరి.  ఓలా, ఊబర్ డ్రైవర్లు సమ్మెకు ఆ పార్టీ వాళ్ళు మద్దతు పలుకుతారో చూడాలి మరి. ఈ రెండు సమ్మెల ఎఫెక్ట్ ఉప ఎన్నికలకు ఏమైనా ఎఫెక్ట్ ఇస్తుందా.. ఇప్పటికైనా తెలంగాణ సర్కార్ ఒక నిర్ణయం తీసుకొని  సమస్యలను తీరుస్తే బాగుంటుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: