హైకోర్టు సైతం ఆర్టీసి వారిపై కన్నెర్ర చేసిన సంగతి తెలిసిందే. ఈ సమ్మె విషయంలో ప్రభుత్వం స్పందించకపోతే మరింత ఉధృతం చేయాలని ఆర్టీసీ జేఏసీ నిర్ణయించింది. తాము చర్చలకు సిద్ధమని., చర్చలు ఎవరితో జరపాలన్న విషయంలో ప్రభుత్వం ఇంకా స్పష్టం చేయకపోవటాన్ని తప్పుపట్టింది. 

జేఏసీ ప్రతినిధులు నేటి బుధవారం హైకోర్టు వారితో అత్యవసరంగా భేటీ అయ్యారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయలేమని ప్రభుత్వం కోర్టుకు తేల్చిచెప్పడంతో.. ఈ విషయంపై జరగాల్సిన వ్యూహంపై చర్చించారు. ఈ విషయంలో పట్టువదిలి, ఆర్టీసీ పరిరక్షణ కోణంలో డిమాండ్‌ చేయాలని కొందరి సభ్యుల అభిప్రాయం. ప్రైవేటీకరణ, అద్దె బస్సుల సంఖ్య పెంపు విషయాన్ని తీవ్రంగా వ్యతిరేకించాలని., ఆర్టీసీ విలీన అంశంలో పట్టువిడుపులతో వ్యవహరించి, ప్రైవేటీకరణ యోచనపై గట్టిగా వాదించాలని నిర్ణయించారు. అందుకోసం మద్దతు కూడగట్టుకొని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన రాజకీయ జేఏసీ సమావేశంలో సభ్యులు పాల్గొన్నారు.

హైకోర్టు సూచనల మేరకు చర్చలకు ఆహ్వానించి ఆర్టీసీ కార్మికుల సమ్మె పరిష్కరించాలని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి డిమాండ్‌ చేయగా... బుధవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన అఖిల పక్ష సమావేశంలో పాల్గొన్న అశ్వత్థామ రెడ్డి మాట్లాడుతూ.. అరెస్ట్‌ చేసిన ఆర్టీసీ కార్మికులను వీలైనంత త్వరగా విడుద చేయాలనే డిమాండ్లను చేశారు. ఈ నెల 19న జరగబోయే ఆర్టీసీ కార్మికుల బంద్‌ను విజయవంతం చేయాలని టీజేఎస్‌ అధ్యక్షుడు ప్రొ:కోదండరాం పిలుపునిచ్చారు. అఖిలపక్ష సమావేశంలో ప్రముఖులు మాట్లాడుతూ.. ప్రజలు, విద్యార్థులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, కర్షకులు సమ్మెను విజయవంతం చేయాలని కోరారు. 

అసలు ఈ ఆర్టీసీ సమ్మె విషయంలో ప్రభుత్వం తీరు ఎందుకు ఇంత మొండిగా వ్యవహరిస్తోందో మరి!!!

మరింత సమాచారం తెలుసుకోండి: