ఆదిలాబాద్ జిల్లాలో ఆర్టీసీ బస్సులో బుధవారం తుపాకీ కలకలం రేపింది.. ఆదిలాబాద్‌ నుంచి నాగ్‌పూర్‌కు బయల్దేరిన బస్సులో తుపాకీ లభ్యమైంది. నిర్మల్‌కి చెందిన ఓ వ్యక్తి దగ్గర ఈ తుపాకీ లభించింది.

వివరాల్లోకి వెళితే నిర్మల్ జిల్లా పోన్కల్‌ గ్రామానికి చెందిన టాటాఏసీ వ్యాన్‌ డ్రైవర్‌ షేక్‌ హైదర్‌ తుపాకీ వెంట తీసుకుని ఆర్టీసీ బస్సులో నాగ్‌పూర్‌కు బయల్దేరాడు. మహారాష్ట్రలోని వార్ద జిల్లా వన్నెర చెక్‌పోస్టు వద్ద ఉదయం 11:30 గంటల సమయంలో మహారాష్ట్ర పోలీసులు నిర్వహిస్తున్న తనిఖీలలో హైదర్ వద్ద ఒక కంట్రిమేడ్‌ తుపాకీ, తొమ్మిది బుల్లెట్లు కనిపించాయి.. వెంటనే మహారాష్ట్ర పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. 

మహారాష్ట్రలో ఎన్నికలు జరుగుతున్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఇందులో భాగంగా అక్కడ పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఉదంతం చూసి భయబ్రాంతులకు లోనైన వ్యక్తి దిగి పారిపోతుండగా మహారాష్ట్ర పోలీసులు వెంబడించి అనుమానిత వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారన చేపట్టారు.. విచారణలో ఒకొక్కటిగా నిందితుడి పేరు., ఊరు, వృత్తి అన్నీ బయట కొచ్చాయి.. అదిలాబాద్ జిల్లా కు చెందిన వ్యక్తి అవ్వడంతో వెంటనే ఆ ప్రాంత పోలీసు వారికి సమాచారాన్నందించారు.. 

ఒకవైపు తెలంగాణ లో జరుగుతున్న ఆర్టీసీ సమ్మెని దృష్టిలో ఉంచుకొని ఎవరైనా ఇలా చేసారా...??? లేకపోతే మహారాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో ప్రత్యేకించి ఏ వ్యక్తి నైనా ఉద్దేశించి చేసారా...??? అసలు సాధారణ వాన్ డ్రైవర్ లకు తుపాకీ ఎలా లభించింది..?? మొన్నటికి మొన్న పంజాగుట్ట రూట్ లో వెళుతున్న ఓ ఆర్టీసీ బస్ లో కాల్పుల కలకలం రేపిన సంగతి తెలిసిందే..,, ఒక సాధారణ వ్యక్తులకు తుపాకీ సరఫరా అందిస్తున్న..!! అందుకుంటున్న..!! దేశ ద్రోహులను ప్రభుత్వం ఎందుకు శిక్షించట్లేదు..?? లాంటి ఎన్నో అనుమానాలు ప్రజలలో చోటు చేసుకుంటున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: