ఆంధ్రజ్యోతి ఒక ప్రముఖ తెలుగు దినపత్రిక. ఈ దినపత్రిక తెలియని వ్యక్తి ఎవరు లేరు. ఐత ఇది ప్రఖ్యాత సంపాదకుడు, హేతువాది అయిన నార్ల వెంకటేశ్వరరావు, ఔత్సాహిక పారిశ్రామికవేత్త కె.యల్.ఎన్.ప్రసాద్ మరికొందరు మిత్రులతో కలసి 1960 జూలై 1న ఈ పత్రికను విజయవాడలో ప్రారంభించారు. 2000లో ప్రచురణ నిలిచిపోయింది. 2002 లో కొత్త యాజమాన్యంతో వేమూరి రాధాకృష్ణ సారథ్యంలో తిరిగి ప్రచురణ మొదలైంది.అయితే ఇటీవల వెలుగులోకి వచ్చిన విషయం ఆంధ్రజ్యోతి ది కావడం ఆశ్చర్యకరం. 


ఆంధ్రజ్యోతి యాజమాన్యం సుమారు సుమారు 40 కోట్ల విలువైన భూమిని తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఆ మీడియాకు గత ప్రభుత్వం కేవలం 50 లక్షల ఐదువేల రూపాయలకే కేటాయించారని, దానిని రద్దు చేయాలని మంత్రివర్గం నిర్ణయించిందని సమాచార శాఖ మంత్రి పేర్పి నాని వెల్లడించారు.


వివరాల్లోకి వస్తే, గత ప్రభుత్వం అక్రమంగా ఆమోదా పబ్లికేషన్ సంస్థ అంటే ఆంధ్రజ్యోతి మీడియాకు విశాఖపట్నం నడిబొడ్డున పరదేశీపాలెంలో ఎకరంన్నర భూమిని కేటాయించిందని, అది కూడా తక్కువ డబ్బుకి ఇచ్చిందని...మంత్రివర్గం తెలిపింది. మరియు అది పూర్తిగా అవసరం లేని కేటాయింపు అని ఏపీ మంత్రివర్గం అభిప్రాయపడింది. ఆ పత్రికకు గత ప్రభుత్వం కేవలం క్విడ్ ప్రోకో కింద ఆ భూమిని కేటాయించిందని అంతేకాదు,నిజానికి ఆ పత్రికకు ఇప్పటికే అవసరమైన స్థలం ఉందని అందుకే  అక్కడ ఆ భూమిలో నిర్దిష్ట కార్యకలాపాలు సాగడం లేదని సమాచార శాఖ మంత్రి పేర్పి నాని వెల్లడించారు.


అందువల్ల ఆ భూమి కేటాయింపును రద్దు చేయాలని మంత్రివర్గం నిర్ణయించిందని ఆయన తెలిపారు.కేవలం రాజకీయంగా శత్రువులపై విష ప్రచారానికి పాల్పడడానికే గత ప్రభుత్వం ఆ భూమి కేటాయింపు చేసిందని ఆయన అన్నారు. ఆ భూమి కేటాయింపును రద్దుచేసి బలహీనవర్గాల ఇళ్ల నిర్మాణానికి కేటాయించాలని కూడా నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: