వైకాపా వరసగా సంచలన నిర్ణయాలు తీసుకుంటూ దూసుకుపోతున్నది.  ఇప్పటికే అనేక పధకాలను ప్రవేశపెట్టిన వైకాపా తాజాగా పేదల కోసం తాజాగా ఓ నిర్ణయం తీసుకుంది.  వచ్చే ఏడాది ఉగాదిలోపు రాష్ట్రంలో అర్హులైన పేదలకు అందరికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు.  దానికోసం అర్హులైన పేదలను గుర్తించి.. వారిని రెండు రకాలుగా విభజించాలని నిర్ణయం తీసుకున్నారు.  పట్టణ, గ్రామాల్లో పేదలకు విడివిడిగా ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.  


పట్టణాల్లో అర్హులైన పేదలకు రెండు సెంట్ల భూమి, గ్రామాల్లోని ప్రజలకు మూడు సెంట్ల భూమిని పేదలకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.  ఒక్క భూమిని ఇవ్వడమే కాకుండా, అందులో ఇల్లు కట్టుకోవడానికి తగినట్టుగా ఇంటిని కూడా మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కట్టించిన ఇల్లు కాకుండా ఇళ్ల స్థలాలు ఇవ్వడం వెనుక కారణం ఉందని, జీ 2 ఇళ్లను నిర్మించి ఇవ్వడం వలన దాని మెయింటైన్ చేయడం చాలా కష్టంగా ఉందని పేదలు వాపోతున్నారట.  


పేదలకు ఇచ్చిన ఇళ్లను సరిగా మెయింటైన్ చేయలేపోతే.. ఇల్లు పాడైపోయే ప్రమాదం ఉంది.  అదే మధ్యతరగతి ప్రజలైతే.. ఇంటిని సరిగా మెయింటైన్ చేయగలుగుతారని, కానీ, పేదలకు అది కష్టంగా మారుతుందని అందుకే కట్టించిన ఇళ్లకు బదులుగా ఇళ్ల స్థలాలు ఇస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ప్రభుత్వం ఇస్తున్న ఇళ్ల స్థలాల్లో ఇంటిని నిర్మించుకోడానికి అవసరమైన నిధులు కూడా ఇవ్వనున్నట్టు ప్రభుత్వం చెప్తున్నది.  


ప్రభుత్వం ప్రజల కోసం ఇప్పటికే అనేక పధకాలు ప్రవేశపెట్టింది.  పింఛన్ పధకం, నిరుద్యోగులకు గ్రామవాలంటీర్ పోస్టులు, గ్రామ సచివాలయం పోస్టులు మంజూరు చేసింది.  దీంతో పాటుగా ప్రతి జనవరిలో ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు రిలీజ్ చేయబోతున్నది. మద్యం విషయంలో కూడా ప్రభుత్వం ఉక్కుపాదం మోపడం విశేషం.  మరోవైపు హోమ్ గార్డులకు జీతాలు కూడా పెంచి వారి కళ్ళలో ఆనందాన్ని తీసుకొచ్చింది ప్రభుత్వం.  


మరింత సమాచారం తెలుసుకోండి: