రానున్న రోజుల్లో ఎంత గడ్డు పరిస్థితిని తాను ఎదుర్కోనున్నాడు అన్న విషయం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావుకు ఈ దెబ్బతో తెలిసి వచ్చి ఉంటుంది. కెసిఆర్ బై-ఎలక్షన్ జరగనున్న హుజూర్ నగర్ లో ర్యాలీ నిర్వహించాల్సి ఉంది. లోక్ సభకు ఎన్నికైన కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ నియోజకవర్గమైన హుజూర్ నగర్ అసెంబ్లీ బై ఎలక్షన్ వైపే ఇప్పుడు అందరి కళ్ళు ఉండగా అర్ధాంతరంగా ముఖ్యమంత్రి ఆఫీస్ నుండి ఆ సభ నిలిపివేస్తున్నట్లు లెటర్ రావడం విచిత్రం.

డైరెక్టర్ ఆఫ్ ఏవియేషన్ భరత్ రెడ్డి ముఖ్యమంత్రి కార్యాలయానికి రాసిన ఉత్తరంలో కెసిఆర్ హుజూర్ నగర్ కి విమానంలో రావడం అంత మంచిది కాదని పేర్కొన్నారని అఫీషియల్ గా బయటికి వచ్చిన సంగతి. అయితే రాజకీయవర్గాల సమాచారం మాత్రం వేరేలా ఉంది. తమకు ఈ ర్యాలీ జరగదని రెండు రోజుల ముందే తెలుసునని.... ఇంటెలిజెన్స్ వర్గాల రిపోర్టు మేర ప్రజలు మరియు ఆర్టీసీ ఉద్యోగుల నుండి తీవ్రమైన వ్యతిరేకత ఈ ర్యాలీలో వారికి ఎదురు కానుందని.... కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇది కాస్తా రద్దు అవుతుందని వారు చెప్పడం ఇక్కడ గమనార్హం.

అదే నిజమైతే మన డేరింగ్ అండ్ డాషింగ్ ముఖ్యమంత్రి గారు తెలివిగా వాతావరణం బాగాలేక ర్యాలీ నిర్వహించడం లేదు అని సాకు పెట్టుకొని తప్పించుకున్నట్లే. ఇకపోతే టిఆర్ఎస్ నాయకులు మాత్రం లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మీటింగుకు ఏర్పాట్లు చేశారు. కానీ ఆఖరి నిమిషంలో వారు కూడా ఎక్కువ మంది జనాల్ని మీటింగుకు పోగు చేయగలమని హామీ ఇవ్వలేకపోయారని భోగట్టా. అందుకే ఎందుకొచ్చిన గొడవ అని కెసిఆర్ హుజూర్ నగర్ లో జరగాల్సిన ర్యాలీ మరియు మీటింగ్ ను క్యాన్సల్ చేశారని అంటున్నారు. అదే కనుక నిజమైతే రానున్న రోజుల్లో కెసిఆర్ మరిన్ని దెబ్బలని చవి చూడాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: