రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చని నా ఫోన్ ను ట్యాప్ చేశారని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి పదవి శాశ్వతం కాదని మంత్రులు మాతో టచ్ లో ఉన్నారని అశ్వత్థామ రెడ్డి అన్నారు. మేధావులు ఆర్టీసీ కార్మికుల సమ్మె విషయంలో మౌనంగా ఉండటం మంచిది కాదని అశ్వత్థామ రెడ్డి అన్నారు. హైదరాబాద్ లోని టీఎంయూ కార్యాలయంలో మాట్లాడిన అశ్వత్థామ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. 
 
ఆర్టీసీ కార్మికులను చర్చకు ఆహ్వానిస్తే విలీనం ఏ విధంగా సాధ్యం అవుతుందో చెబుతామని అన్నారు. ప్రభుత్వంతో చర్చలు జరపటానికి ఆర్టీసీ కార్మికులు సిద్ధంగానే ఉన్నట్లు అశ్వత్థామ రెడ్డి ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఎన్నో ఉద్యమాలు చేసి సాధించామని, తెలంగాణలో నేనే రాజు నేనే మంత్రి అంటే కుదరదని సీఎం కేసీఆర్ ను ఉద్దేశించి అశ్వత్థామ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె పరిష్కారం కాకపోతే రాజ్యాంగ సంక్షోభం రావొచ్చని అన్నారు. 
 
గతంలో వైస్రాయ్ ఘటన జరిగిందని ఆ ఘటన గురించి మరిచిపోవద్దని అశ్వత్థామ రెడ్డి సీఎంను ఉద్దేశించి అన్నారు. సమ్మె వ్యవహారం గురించి ఇతర పార్టీల ఎమ్మెల్యేలతో పాటు టీఆర్ ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా తనతో మాట్లాడుతున్నారని అశ్వత్థామ రెడ్డి అన్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె గురించి టీఆర్ ఎస్ పార్టీ మంత్రులు మౌనం వీడాలని అశ్వత్థామ రెడ్డి అన్నారు. 
 
జగదీష్ రెడ్డి, ఈటల రాజేందర్, హరీశ్ రావు మౌనం వీడి సమ్మె గురించి స్పందించాలని అశ్వత్థామ రెడ్డి చెప్పారు. హైకోర్టులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ఎండగడతామని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా ఐక్యం కావాలని ఆర్టీసీ ఆస్తులను కొల్లగొట్టే ప్రయత్నం జరుగుతోందని అశ్వత్థామ రెడ్డి చెప్పారు. ఆర్టీసీ కార్మికులు చర్చకు సిద్ధమని అశ్వత్థామ రెడ్డి చెప్పిన నేపథ్యంలో చర్చల విషయంలో ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. 
 



మరింత సమాచారం తెలుసుకోండి: