వైయస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకవైపు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూనే మరొక వైపు తన వ్యతిరేకదారులకు చుక్కలు చూపిస్తున్నాడు. అది కూడా ఏదో కక్షసాధింపులా కాకుండా చాలా చక్కగా న్యాయమైన పద్ధతిలో చేస్తుండడం హర్షణీయం. విషయం ఏమిటంటే అమోడ పబ్లికేషన్స్ కు చెందిన ఆంధ్రజ్యోతి మీడియా సంస్థకు ముందు ఉన్న టిడిపి ప్రభుత్వం కేటాయించిన 1.5 ఎకరాల భూమిని ఇప్పటి జగన్ రాష్ట్ర ప్రభుత్వం వారికి చెందకుండా ఉండేటట్లు ఆర్డర్లు పాస్ చేసింది. ఇప్పుడు ఆ స్థలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి చెందినది కావడం గమనార్హం. అంతేకాదండోయ్ అదే స్థలాన్ని ప్రభుత్వం పేద ప్రజలకు కేటాయించినట్లు కూడా నిర్ణయాన్ని ప్రకటించింది. 

అంతేకాకుండా ఇన్ఫర్మేషన్ మరియు పబ్లిక్ లైసెన్స్ (ఐ&పిఆర్) మినిస్టర్ పేర్ని వెంకట్రామయ్య అలియాస్ పేర్ని నాని క్యాబినెట్ లో ఒక కొత్త ప్రపోజల్ పెట్టారు. 2007లో రూపొందించబడిన జీవో ప్రకారం స్పెషల్ కమిషనర్ మరియుఐ&పిఆర్ డిపార్ట్మెంట్ లకు నిరాధారమైన మరియు ఫేక్ మీడియా రిపోర్టుల పైన చట్టబద్ధంగా చర్యలు తీసుకొని వారిపై కేసులు వేసే అధికారం ఉంది. ఈ ప్రపోజల్ క్యాబినెట్ లో అందరూ ఆమోదం తెలుపగా ఇప్పుడు సెక్రటరీ రాంకు అధికారులందరికీ ఇప్పుడు ఇలా చర్యలు తీసుకొనే అధికారం వచ్చేసింది.

ఇప్పటికే దాదాపు వంద రోజులు పైన పరిపాలనలో ఎన్నో సంచలనాత్మక నిర్ణయాలు తీసుకున్న జగన్ ప్రభుత్వం పై ఎప్పుడూ దుమ్మెత్తి పోస్తున్న ఎల్లో మీడియాను ఉద్దేశించి ఈ జీవో కు మరింత బలం చేకూర్చిన అర్థమవుతుంది. తాము ఎన్ని రోజులు ప్రజల కోసం ఇచ్చిన హామీలు అన్నింటిని తు.చ.తప్పకుండా అమలు చేస్తుంటే వీళ్లు మాత్రం బురద జల్లడం ఆపట్లేదని వారి ఉద్దేశం కాబోలు. జగన్ తీసుకున్న ఈ సంచలనమైన నిర్ణయంతో మిగతా మీడియా వర్గాలు కూడా కొంచెం జాగ్రత్తగా తమ వార్తలను ప్రచురిస్తూ మీడియా విలువలు కాపాడతాయనడంలోలో ఎలాంటి సందేహం లేదు. ఇకపోతే జగన్ జాతీయ మీడియాలో కూడా కొందరి పట్ల అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. మరి జగన్ వారికి అడ్డుకట్ట వేసేందుకు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడో చూడాలి మరి


మరింత సమాచారం తెలుసుకోండి: