కామా తురానాం న భయం న లజ్జ..ఈ మద్య కొంత మంది మృగాళ్లు మహిళలు, చిన్న పిల్లలు, వృద్దులని కూడా చూడకుండా లైంగిక దాడులకు పాల్పపడుతు న్నారు.  తమ బండారం బయట పడుతుందని దారుణంగా చంపిన సంఘటనలు కూడా ఎన్నో ఉన్నాయి. ఇటీవల హన్మకొండలో ఓ దుర్మార్గుడు తొమ్మిదేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి గొంతు నులిమి చంపేశాడు.  వరంగల్ కోర్టు అతనికి ఉరిశిక్ష విధించిన విషయం తెలిసిందే. ఇలా తెలుగు రాష్ట్రాల్లో చిన్నారులపై, మహిళలపై ప్రతిరోజు ఎక్కడో అక్కడ లైంగిక వేధింపులు, అత్యాచారాలు, హత్యలు జరుగుతూనే ఉన్నాయి. 

కానీ ఇప్పుడు మీరు చదివే మ్యాటర్ రివర్స్.. అవును తమతో సెక్స్ లో పాల్గొనలేదని ఓ డ్రైవర్ ని చితకబాది..అతని వద్ద ఉన్న డబ్బులు లాక్కొని వెళ్లిపోయారు ముగ్గురు మహిళలు.  కర్నాటకలోని బిఎంటిసి బస్టాండ్ సమీపంలో ఉప్పర్ పేట ఫ్లైఓవర్ వద్ద ఈ సంఘటన జరిగింది.  ఉప్పర్ పేట ఫ్లైఓవర్ కొంత మంది వేశ్యలు విటుల కోసం వేచి ఉండటం..డబ్బు తీసుకొని వారికి లైంగిక సుఖం అందిస్తుంటారు. తాజాగా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మోహన్ కుమార్ అనే డ్రైవర్ ఉప్పర్ పేట ఫ్లైఓవర్ నుంచి తన ఇంటికి వెళ్తుండగా ముగ్గురు మహిళలు తారసపడ్డారు.

తమతో సెక్స్ చేయాలని మోహన్ ని అడ్డుకున్నారు..తాను అలాంటి వాడిని కాదు మోర్రో అన్నా ఆ ముగ్గురు మోహన్ పై దాడి చేసి తమతో ఎందుకు సెక్స్ లో పాల్గొనవని కొట్టారు. అనంతరం అతడి జేబులో ఉన్న డబ్బంతా లాక్కున్నారు.  మళ్లీ అతనిపై దాడి చేసి అక్కడ నుంచి పారిపోయారు. బిక్కు బిక్కుమంటూ బాధితుడు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఫ్లై ఓవర్ సమీపంలో ఉన్న సిసి కెమెరాల ఆధారంగా విచారణ చేస్తామని పోలీసులు వెల్లడించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: