మాజీ మంత్రి జేసీ దివాకర్‌రెడ్డి పరిస్థితి రోజు రోజుకు మరింత ఘోరంగా తయారవుతుంది. మొన్న ఎన్నికల్లో వారసులను నిలబెట్టి ఘోరాతి ఘోరంగా ఓడిపోయినా సంగతి తెలిసిందే. అనంతరం టీడీపీకి గుడ్ బై చప్తున్నట్టు బీజేపీలో చేరుతున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే నిన్నటికి నిన్న దివాకర్ రెడ్డి మాట్లాడుతూ అవసరమైతే బీజేపీ, టీడీపీ ఏకమైతాయి అని వార్తలు వచ్చాయి. 


ఇంకా విషయానికి వస్తే..  మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి ఆర్టీఏ అధికారులు షాక్ ఇచ్చారు. దివాకర్ ట్రావెల్స్ కు చెందిన 23 బస్సులను సీజ్ చేశారు.  ఆర్టీఏ కమిషనర్ సీతారామాంజనేయులు, జాయింట్ కమీషనర్ ప్రసాద్ రావు ఆధ్వర్యంలో అధికారులు తనిఖీలు నిర్వహించగా దివాకర్ ట్రావెల్స్‌కు చెందిన బస్సుల్లో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవటం, ఇష్టానుసారంగా టికెట్ల రేట్లు పెంచటం వంటి ఆరోపణలు వచ్చాయని, అవి నిజమేనని తేలటంతోనే సీజ్ చేస్తున్నట్టు ఆర్టీఏ అధికారులు తెలిపారు. 


కాగా దివాకర్ రెడ్డికి చెందిన 23 బస్సులను సీజ్ చెయ్యగా మిగిలి ప్రైవేట్ బస్సులను కూడా సీజ్ చేసినట్టు ఆర్టీఏ అధికారులు తెలిపారు. కాగా అనంతపురు జిల్లాకు సంబంధించి 8 బస్సులను సీజ్ చేశారు. సీజ్ చేసిన బస్సులను ఆర్టీసీ డిపోకు తరలించినట్టు సమాచారం. కాగా గత అయుదు సంవత్సరాల్లో కొన్ని వేల సంఖ్యలో కేసులు నమోదు అయినట్టు ఆర్టీఏ అధికారులు తెలుపుతున్నారు.  


కాగా ఈ వార్తలు చదివిన నెటిజన్లు దివాకర్ బస్సులను సీజ్ చెయ్యడం మంచిది అయ్యింది అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఆ బస్సుల కారణంగా చాల మంది మృతి చెందారని, వారి ఓవర్ స్పీడ్ కారణంగా ఎదురు వెళ్లే అమాయకులు కూడా ప్రాణాలను విడిచారని నెటిజన్లు అంటున్నారు. కాగా నిజానికి దివాకర్ బస్సులో 8 గంటల ప్రయాణం కూడా 6 గంటల్లో ఉంటుంది అని అంత స్పీడ్ గా బస్సు తోలుతున్నారని అంటున్నారు నెటిజన్లు. 


మరింత సమాచారం తెలుసుకోండి: