అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడటంతో ప్రధాన పార్టీలు ప్రచారంలో వేగాన్ని పెంచాయి, రసవత్తరంగా సాగుతున్న ఈ పోటీలో కమళ దళాలు కాంతివంతంగా ప్రకాశిస్తూ,  ప్రతిపక్షం పైన లేజర్ కిరణాలు వంటి మాటలతో విరుచుకు పడుతున్నాయి.అందుకు మోదీ ఏమి మినహాయింపు కాదు. ఇప్పుడు మరోమారు కాంగ్రెస్ పై విరుచుకుపడ్డారు. ఈ అవినీతి, పేద వ్యతిరేక కాంగ్రెస్ పార్టీ వల్ల ఒరిగేదేమి లేదని కేవలం బీజేపీ వల్లే అభివృద్ధి సాద్యమని తెలిపారు..


ఇకపోతే మహారాష్ట్రలోని అకోలాలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోదీ.. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌కు భారతరత్న ఇవ్వడానికి కాంగ్రెస్ నిరాకరించిందని విమర్శించారు. ఇపుడు అదే వైఖరిని సావర్కర్‌పై చూపిస్తుందని అన్నారు. అంబేడ్కర్‌, సావర్కర్‌  లాంటి గొప్ప వ్యక్తులను కాంగ్రెస్‌ పార్టీ మరిచిందని.  వీర సావర్కర్ జాతీయతను నేర్పించిన వారు. ఆధునిక భారతానికి సంస్కారం నేర్పిన వారు. అలాంటి వ్యక్తికి భారతరత్న ఇస్తామంటే కాంగ్రెస్ అడ్డుపడుతోందని మండిపడ్డారు. కాంగ్రెస్‌-ఎన్సీపీలది అవినీతి పోత్తని మోదీ విమర్శించారు. గత దశాబ్ద కాలంగా మహారాష్ట్రను అణగదొక్కింది కాంగ్రెస్‌-ఎన్సీపీలేనని పేర్కొన్నారు.


అంతేకాకుండా ఆర్టికల్ 370 ని రాజకీయ స్వప్రయోజనాల కోసం రద్దు చేయలేదని, కేవలం దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొనే రద్దు చేశామని ఆయన స్పష్టం చేశారు. ఆర్టికల్ 370 ని రద్దు చేస్తే దేశం నాశనమైపోతుందని కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానించారని, 370 ని రద్దు చేసి మూడు నెలలు గడిచిపోయింది. దేశం నాశనమైందా? అని సూటిగా ప్రశ్నించారు. అంతేకాకుండా 370 ని రద్దు చేస్తే కశ్మీర్‌ను పూర్తిగా కోల్పోవాల్సి వస్తుందని వారు అనడంపై కూడా మోదీ ధ్వజమెత్తారు. 370 ని రద్దు చేసేశాం. కశ్మీర్‌ను మనం కోల్పోయామా? అని ప్రశ్నించారు. ఇంతే కాకుండా  మాది ట్రాక్‌ రికార్డ్‌.. వారిది టేప్‌ రికార్డ్‌ అంటూ  కాంగ్రెస్ పార్టీని ఎద్దేవా చేసారు.


మరింత సమాచారం తెలుసుకోండి: