ఇప్పటికే దాదాపు ఏభైవేలమంది ఆర్టీసీ కార్మికుల ఉద్యోగాలను బలితీసుకొని - చేసిన పనికాలానికి కూడా జీతాలు పొందని పండగ పూట వారి కుటుంబాల్లో నెలకొన్న నైరాశ్యం ఒకరు ఔనన్నా మరోకరు కాదణ్ణా సకల తెలంగాణా వాసులను కలత అరచే విషయమే! ఆర్టీసీ సమ్మె పదమూడు రోజులుగా జరుగుతున్నా రాష్ట్ర ఉన్నత న్యాయ స్థానం కలగజేసుకున్నా ఇరు పక్షాలు సమావేశమై సమయను కొలిక్కి తెచ్చే ఆలోచనే చేయని సందర్భంలో  గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ రంగంలోకి దిగారు.
Image result for Telangana governor quetions kcr goverment about rtc emp strike
‘అసలేం జరుగుతోంది?’ అంటూ రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ కు ఫోన్‌ చేసి వివరాలడిగారని అభిఙ్జవర్గాల కథనం. 'సెల్ఫ్‌ డిస్మిస్‌' పేరుతో కార్మికుల తొలగింపు ఆపై సమ్మె తీవ్రత, ఆతరవాత 19వ తేదీన తల పెట్టిన రాష్ట్ర బంద్ వంటి అంశాలపై వివరాలు తెలుసుకున్నారు. అసలు కార్మిక చట్టాల్లో "సెల్ఫ్‌ డిస్మిస్‌"  అనే పదం ఉందా? దానికి నిర్వచనం ఏమిటి? అని ఆమె సూటిగా ప్రశ్నించినట్లు సమాచారం. ఆ పదం లేకుండా నోటి మాటతో 48 వేల మంది కార్మికులు ఉద్యోగాల నుండి తొలగిపోయినట్లు ఎలా చెబుతారని గవర్నర్ మంత్రివర్యులను నిలదీసినట్లు తెలిసింది.

ఆర్టీసీ జేఏసీతో పాటు బీజేపీ రాష్ట్ర నాయకులు, ఇతర ప్రతిపక్ష నాయకులు ఇప్పటికే పలు సార్లు తెలంగాణా రాష్ట్ర గవర్నర్‌ను కలిసి సమ్మె గురించి వివరించారు. ఆర్టీ కార్మికులు కార్మిక చటాల ప్రకారం ముందుగానే సమ్మె నోటీస్ ఇచ్చినప్పుడు వారు సమ్మె ప్రారంభించేంతవరకు ప్రభుత్వ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ప్రజల పట్ల బాధ్యత వహించాల్సిన ప్రభుత్వం ఇంత నిర్లిప్తత అలక్ష్యం నిర్లఖ్యం - ప్రభుత్వ వైఫల్యం వల్లే సమ్మె జరుగుతోందని ప్రజల్లోకి వెళ్ళిపోయింది. గత 13 రోజులుగా ప్రజల్ని కష్టాల్లోకి నెట్టేసి ఆ అగ్ని ముందు ప్రభుత్వం చలి కాచుకుంటుందని ప్ఫ్రజలు భావిస్తున్న విషయాలను వారంతా గవర్నర్ కు వివరించారు.
Image result for Telangana governor quetions kcr goverment about rtc emp strike
వెంటనే ఢిల్లీకి వెళ్లిన గవర్నర్‌ తమిళ సై, సుమారు 40 నిమిషాల పాటు ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమైన సందర్భంలో టిఎస్-ఆర్టీసి ఆర్టీసీ సమ్మె తీవ్రత, కార్మికుల ఆత్మహత్యలు, ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ఆయనకు వివరించారు. ఆ తర్వాత రాష్ట్రానికి తిరిగి వచ్చిన ఆమెతో బీజేపీ రాష్ట్ర నాయకులు మరోసారి కలిసారు. నిన్న గురువారం ఆమె ఆర్టీసీ సమ్మె నివారణ కోసం లేదా సమస్య అంతకంతకు జఠిలం కారాదని తానే స్వయంగా రంగంలోకి దిగారు.

ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులకు వేతనాలు ఇవ్వాలని ఆర్టీసీ యాజమాన్యానికి ఆదేశాలివ్వాలంటూ హైకోర్టులో ఇటీవల పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే. దీనిపై విచారించిన న్యాయస్థానం ఈ మేరకే ఈ ఆదేశాలు ఇచ్చింది. అలాగే, ఆర్టీసీ కార్మికులు, ప్రభుత్వానికి హైకోర్టు పలు సూచనలు చేసింది. కార్మికులతో సర్కారు చర్చలు జరపాలని, సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని తెలిపింది. ఆర్టీసీ కార్మికులు వెనక్కి తగ్గి, సమ్మె విరమించాలని సూచించింది. కాగా, చర్చల కోసం ప్రభుత్వం నుంచి పిలుపురాకపోవడంతో ఆందోళనలు మరింత ఉద్ధృతం చేయాలని ఆర్టీసీ జేఏసీ యోచిస్తోంది.

ఆర్టీసీకి పూర్తిస్థాయి ఎండీని నియమించాలని ఇప్పటికే హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఆ ఆదేశాల అమలు తీరు గురించి తెలుసుకొవటా నికి ప్రయత్నిస్తున్నారు.

*హైకోర్ట్ ఆదేశాల అమలు తీరు ఎలా ఉంది?

*కార్మికులతో చర్చలు జరపడానికి,

*ప్రజారవాణా వ్యవస్థను సాధారణ మాములు స్థితికి తెచ్చేందుకు ఏం చర్యలు తీసుకుంటున్నారు?

అని మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ను ఆమె ఫోన్‌లో ఆరా తీశారు. ప్రజలు ఇబ్బంది పడకుండా బస్సులను నడుపుతున్నామని, రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్‌ శర్మ వచ్చి పూర్తిగా వివరిస్తారని ఆయన చెప్పారు. అనంతరం సునీల్‌ శర్మను గవర్నర్‌ పిలిపించారు. ఆర్టీసీ సమ్మె వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి ఆయనను అడిగి తెలుసుకున్నట్లు రాజ్‌ భవన్‌ వర్గాలు తెలిపాయి. ప్రజలకు రవాణా సదుపాయాలు కల్పించడానికి ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం పలు చర్యలు చేపడుతున్నాయని గవర్నర్‌కు సునీల్‌ శర్మ వివరించారు.
Image result for Telangana governor quetions kcr goverment about rtc emp strike
ప్రస్తుతం రాష్ట్రంలో 9వేలకుపైగా బస్సులు నడుస్తున్నాయని చెప్పారు. ప్రయాణికుల నుంచి ఎక్కువ ఛార్జీలు వసూలు చేయకుండా టికెట్‌ ఇష్యూయింగ్‌ మెషిన్స్‌ - ను కూడా ప్రవేశపెట్టామన్నారు. ప్రైవేటు ఉద్యోగులతో బస్సులను నడుపుతున్నందున కొంత మంది చేతివాటాన్ని ప్రదర్శించే అవకాశం ఉందని తెలిపారు. సమ్మెపై పలు పార్టీలు, సంఘాల నుంచి వినతిపత్రాలు వస్తున్నాయని సునీల్‌ శర్మతో గవర్నర్‌ అన్నారు.  ఇకనైనా సమ్మె కారణంగా సామాన్య ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని ఆదేశించారు. వెనువెంటనే ప్రయాణ సదుపాయాలు మెరుగుపడేలా సత్వర ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని కోరారు. సమావేశానంతరం అనంతరం సునీల్‌ శర్మ ముఖ్యమంత్రిని కేసీఆర్‌ నిర్వహించిన  ఆర్టీసీ సమ్మెపై సమీక్షలో పాల్గొనేందుకు ప్రగతి భవన్‌కు వెళ్లారు.

గోరుచుట్టు మీద రోకటి పోటు అన్నట్లు రేపు 19న 'తెలంగాణా టాక్సి డ్రైవర్ల ఐకాస' వారి సమస్య సాధనకు వారు కూడా రాష్ట్ర బంద్ నిర్వహించ బోతున్నట్లు వారి నాయకుడు షేక్ సలావుద్దీన్ ప్రకటించారు.
Image result for Telangana governor quetions kcr goverment about rtc emp strike

మరింత సమాచారం తెలుసుకోండి: