ఈ మధ్య కాలంలో ఆన్ లైన్ లో ఆహారం ఆర్డర్ చేసే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. కానీ ఆన్ లైన్ లో ఆర్డర్ చేసిన వారు ఆహారంలో నాణ్యత లోపాలు ఉన్నాయంటూ అధికారులకు ఫిర్యాదులు ఎక్కువగా ఇస్తున్నారు. అధికారుల విచారణలో హోటళ్ల, రెస్టారెంట్ల యజమానులు ఆన్ లైన్ వినియోగదారుల విషయంలో మోసాలు చేస్తునట్లు తెలిసింది. హోటళ్లు, రెస్టారెంట్లకు వచ్చే వినియోగదారులకు నాణ్యతతో కూడిన ఆహారం ఇస్తూ ఆన్ లైన్ లో ఆర్డర్ చేసే వారికి మాత్రం తక్కువ నాణ్యతతో కూడిన ఆహారం అందిస్తున్నట్లు అధికారుల విచారణలో తేలింది. 
 
ఆన్ లైన్ లో తక్కువ ధరకే ఆహారం వస్తుంది కదా అని ఆర్డర్ చేసిన వారికి కొన్ని హోటళ్లు, రెస్టారెంట్లు ఏ మాత్రం నాణ్యత లేని ఆహారం అందిస్తున్నాయి. ఫుడ్ డెలివరీ కంపెనీలు 50 %, 20%, 15% అని డిస్కౌంట్ ధరలతో వినియోగదారుల్ని ఆకర్షిస్తూ వినియోగదారులకు మాత్రం నాణ్యత లేని ఆహారాన్ని అందిస్తున్నాయి. వినియోగదారుల ఫిర్యాదులతో అధికారులు దాడులు జరిపి హోటళ్లు, రెస్టారెంట్లపై తగిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. 
 
కొన్ని హోటళ్లు, రెస్టారెంట్లలో హోటళ్ల యజమానులు సిబ్బందికి ఆన్ లైన్ లో ఆర్డర్ చేసే వారికి, రెస్టారెంట్ కు వచ్చే వారికి నాణ్యతలో తేడా ఉండే విధంగా ఆహారం ఇవ్వాలని సూచించినట్లు తెలుస్తోంది. కొన్ని హోటళ్లు, రెస్టారెంట్లలో ఎక్కడో వండిన ఆహారాన్ని తీసుకొచ్చి ఆన్ లైన్ వినియోగదారులకు అందజేస్తున్నట్లు కూడా అధికారుల విచారణలో తేలింది. 
 
ఆన్ లైన్ లో ఆహారం ఆర్డర్ చేసే వారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం వలన నాణ్యత ఉండే ఆహారాన్ని పొందవచ్చు. ఎక్కువగా జన సందోహం ఉండే హోటళ్లలో ఆహారం ఆర్డర్ చేస్తే అలాంటి హోటళ్లలో ఆహారం నిల్వ చేయాల్సిన అవసరం ఉండదు కాబట్టి నాణ్యతతో కూడిన ఫుడ్ దొరికే అవకాశం ఉంది. నాణ్యత లేని, నిల్వ ఉన్న ఆహారం వలన ఆహారం త్వరగా పాడవ్వటంతో పాటు అనారోగ్య సమస్యలకు కూడా గురయ్యే అవకాశం ఉంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: