సీఎం కేసీఆర్ హుజూర్‌న‌గ‌ర్‌లో త‌ల‌పెట్టిన ప్ర‌చార స‌భ ర‌ద్ద‌వ‌డంపై అనేక అనుమానాలు క‌లుగు తున్నాయి. వ‌ర్షం కార‌ణంగానే స‌భ‌ను ర‌ద్దు చేశామ‌ని ఆపార్టీ నేత‌లు పేర్కొంటున్న‌ప్ప‌టికీ.. ముంద‌స్తు వ్యూహాత్మ‌కం గానే సీఎం స‌భ‌ను ర‌ద్దు చేసుకున్న‌ట్లు రాజ‌కీయ వ‌ర్గాల్లో ప్ర‌చారం జ‌రుగుతోంది. 16, 17 తేదీల్లో రాష్ట్రంలో భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని ముందే వాతావ‌ర‌ణ శాఖ పేర్కొన‌డం, ఆ తర్వాతే ప్ర‌చార స‌భ తేదీని ఖ‌రారు చేయ‌డంలాంటి అంశాల‌ను నిశితంగా గ‌మ‌నిస్తే.. అనేక అనుమానాలు కలుగుతున్నాయి.


ఆర్టీసీ స‌మ్మెతో రాష్ట్రంలో ప‌రిస్థితి నివురుగ‌ప్పిన నిప్పులా ఉంది. రాష్ట్రంలో ఆర్టీసీ స‌మ్మె రోజురోజుకు ఉధృతంగా సాగుతోంది. పార్టీల‌న్నీ స‌మ్మెకు మ‌ద్ద‌తు ప‌ల‌క‌డంతోపాటు ప్ర‌భుత్వా నికి వ్య‌తిరేకంగా పెద్ద ఎత్తున ఉద్య‌మిస్తున్నాయి. ఈనేప‌థ్య‌లో సీపీఐ కూడా త‌న మ‌ద్ద‌తు ఉప‌సంహ‌రించుకుంది.  ఉద్యోగ సంఘాల‌న్నీ జాయింట్ యాక్ష‌న్ క‌మిటీగా ఏర్ప‌డి ధ‌ర్నాలు, రాస్తారోకోలు, వంటావార్పు వంటి కార్య‌క్ర‌మాల‌తో త‌మ నిర‌స‌న‌ను వ్య‌క్తం చేస్తున్నాయి.


స‌మ్మె నేప‌థ్యంలో రాష్ట్రంలో రాజ‌కీయ ప‌రిస్థితులు పూర్తిగా గంద‌ర‌గోళంగా మారాయి. ఈనేప‌థ్యంలోనే హుజూర్‌న‌గ‌ర్‌లో త‌ల‌పెట్టిన ఉప ఎన్నిక ప్ర‌చార స‌భ‌కు కేసీఆర్ వ‌స్తారా.. రారా.. అని రాజ‌కీయ వ‌ర్గాల్లో చ ర్చ మొద‌లైంది. ఒక‌వేళ స‌భ‌కు ముఖ్య‌మంత్రి వ‌స్తే... ఆర్టీసీ కార్మికుల నుంచి నిర‌స‌న ఎదుర్కోక త‌ప్ప‌ని కూడా అంతా భావించారు. ఈ ప‌రిణామాల‌న్నింటినీ గ‌మ‌నించిన కేసీఆర్ కావాల‌నే స‌భ‌ను ర‌ద్దు చేసుకున్నార‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లో ప్ర‌చారం జ‌రుగుతోంది.


అటు టీఆర్ఎస్‌కు సైతం ముందు నుంచి స‌భ‌పై ఆస‌క్తి లేదు. ఇక దీనికి తోడు వ‌ర్షం రావ‌డంతో అది క‌లిసొచ్చింద‌ని వెంట‌నే స‌భ‌ను ర‌ద్దు చేసేసింది. మొత్తానికి వ‌ర్షం కార‌ణంగా సీఎం స‌భ ర‌ద్ద‌వ‌డంతో గులాబీ శ్రేణుల్లో తీవ్ర నైరాశ్యం నెల‌కొంది. ఇక ఈ ప్ర‌చారం ఈ నెల 19వ తేదీతో ముగుస్తుండ‌గా ఈ నెల 21న ఎన్నిక జ‌ర‌గ‌నుంది. 24 ఫ‌లితాలు వెల్ల‌డి కానున్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: