ఆర్టీసీ సమ్మె సెగ కారణంగానే హుజూర్ నగర్ ఎన్నికల ప్రచారానికి ముఖ్యమంత్రి , గులాబీదళపతి కేసీఆర్ హాజరు కాలేదా ? అంటే అవుననే కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి అంటున్నారు . హుజూర్ నగర్ ఉప ఎన్నిక నేపధ్యం లో ఈ నెల 17  వ తేదీన భారీ బహిరంగ సభ నిర్వహణ కు టీఆరెస్ నాయకత్వం ఏర్పాట్లను చేసింది . ఇద్దరు మంత్రులు దగ్గరుండి ఏర్పాట్లను పరిశీలించారు . పెద్ద ఎత్తున జన సమీకరణ చేపట్టారు . అయితే ఉన్నట్టుండి భారీ ఎత్తున వర్షం కురవడం తో సభా ప్రాంగణం పూర్తిగా బురదమయమైంది .


 రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాల కురుస్తుండడం తో హెలికాఫ్టర్ లో ప్రయాణానికి ముఖ్యమంత్రి కి ఏవియేషన్ అధికారులు అనుమతిని నిరాకరించారు . భారీ వర్షానికి తోడు పిడుగులు పడే అవకాశాలున్నాయన్న వాతావరణ శాఖ అధికారుల హెచ్చరిక తో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు వెల్లడించారు . ఈ పరిస్థితుల్లో కేసీఆర్ ఎన్నికల  సభ పాల్గొనడం ఏమాత్రం క్షేమకరం కాదని ఏవియేషన్ అధికారుల సూచన తో ఆయన తన కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు. ప్రతికూల పరిస్థితుల   నేపధ్యం లో కేసీఆర్ సభ కు రాలేకపోవడం తో సభ ను రద్దు చేశారు .


 అయితే సభకు కేసీఆర్ హాజరు కాకపోవడానికి ఆర్టీసీ కార్మికుల సమ్మె కారణమని విపక్ష నేతలు పేర్కొంటున్నారు . హైదరాబాద్ నుంచి హుజూర్ నగర్ కేవలం 200 కిమీ ఉంటుందని , ఏవియేషన్ అధికారులు అనుమతి నిరాకరించిన రోడ్డు మార్గాన సభ కు వెళ్లే అవకాశం ఉన్న కేసీఆర్ వెళ్లకపోవడానికి , సమ్మె చేస్తున్న కార్మికులు నిరసన తెలియజేస్తారన్నభయం వల్లే  వెళ్లలేదని విజయశాంతి అంటున్నారు . సభ ను రద్దు చేసుకోవడం ద్వారా కేసీఆర్ ముందే పరోక్షంగా ఓటమి అంగీకరించారని చెబుతున్నారు .  


మరింత సమాచారం తెలుసుకోండి: