భూ కేటాయింపుల వివాదంలో కోర్టుకెక్కిన ఏబిఎన్, ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణకు హై కోర్టు షాక్ ఇచ్చినట్లే. చంద్రబాబునాయుడు ప్రభుత్వం చేసిన  భూ కేటాయింపులను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రద్దు చేయటంపై రాధాకృష్ణ కోర్టులో లంచ్ మోషన్ క్రింద కేసు వేశారు. అయితే రెండువైపుల లాయర్ల వాదనలు విన్న తర్వాత కోర్టు ప్రభుత్వ వాదన సబబుగా ఉందని అభిప్రాయపడినట్లు తెలుస్తోంది.

 

రాధాకృష్ణకు ఇచ్చిన భూమిని  వైసిపి ప్రభుత్వం రద్దు చేయటానికి జిల్లా కలెక్టర్ ఇచ్చిన నివేదికే ఆధారంగా ప్రభుత్వం కోర్టులో వాదించింది.  రెండేళ్ళ క్రితం రూ. 40 కోట్ల అత్యంత ఖరీదైన  ఒకటిన్నర ఎకరాన్ని వేమూరి కేవలం రూ. 50. 05 లక్షలకే నొక్కేశారు. మూడేళ్ళలోపు ఆ భూమిని వినియోగంలోకి తేవాల్సున్నా అలాంటిదేమీ జరగలేదట. దాంతో స్ధానికులెవరో జగన్ చేసిన ఫిర్యాదుతో అసలు విషయం బయటకొచ్చింది.

 

తనకందిన ఫిర్యాదును జగన్ జిల్లా కలెక్టర్ కు ఇచ్చి విచారించమన్నారు. కలెక్టర్ తన విచారణలో భూమిని ఏ విధంగా కూడా ఉపయోగంలోకి తెస్తున్న దాఖలాల్లేవని నిర్ధారించారు. ఇదే విషయాన్ని వేమూరికి నోటిసు ఇవ్వగానే అప్పటికప్పుడు హడావుడిగా అప్పటికే ఏదో పనులు చేస్తున్నట్లు జేసిబిలు, బుల్ డోజర్లను తెప్పించారని కలెక్టర్ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు.  

 

ఎప్పుడైతే జిల్లా కలెక్టర్ నుండి నివేదిక వచ్చిందో వెంటనే ప్రభుత్వం రంగంలోకి దిగి కేటాయింపులను రద్దు చేసింది. దాంతో వేమూరి వెంటనే కోర్టులో పిటీషన్ వేయటంతో బాల్ న్యాయస్ధానం కోర్టులో పడింది.  

 

 

సరే చివరగా కోర్టు నిరణయం ఎలాగుంటుందన్న విషయాన్ని పక్కన పెట్టేద్దాం.   పిటీషన్ తో చంద్రబాబునాయుడు-రాధాకృష్ణ మధ్య ఉన్న బంధం మరోసారి బయటపడింది. నష్టపరిహారంగా ప్రభుత్వం ఎక్కడైనా డబ్బులు ఇస్తుంది లేకపోతే భూమికి సరిపడా భూమిని మాత్రమే ఇస్తుంది. కానీ చంద్రబాబు మాత్రం రాధాకృష్ణ నుండి తీసుకున్న ఒక ఎకరానికి బదులు 1.5 ఎకరా ఇవ్వటమే విచిత్రంగా ఉంది. ఇక్కడే తెలిసిపోతోంది అక్రమ సంపాదనే అని. చూద్దాం కోర్టు ఏమని తేల్చుతుందో.


మరింత సమాచారం తెలుసుకోండి: