రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పధకాలు అర్హులకు చేరుతున్నాయి లేదో గాని అనర్హులకు మాత్రం పిలిచి మరీ ఇస్తున్నారు. ఏపీలో  కేంద్ర,రాష్ట్ర నిధులతో పెట్టుబడి సాయం కింద రైతులకు రైతు భరోసా పేరుతో రూ.13,500 ప్రభుత్వం అందిస్తోంది. ఈ పధకానికి దాదాపు 40 లక్షలమందికిపైగా రైతులు లబ్దిదారులుగా గుర్తించారు.  గత కొన్నిరోజులగా ఈ పథకం కింద రైతుల ఖాతాల్లో నగదు బదిలీ చేస్తున్నారు.

ఇక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు.. మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలకు రైతు భరోసా వర్తించదని ప్రభుత్వం ముందే క్లారిటీ ఇచ్చింది. కానీ ప్రకాశం జిల్లాలో మాత్రం.. రైతు భరోసా జాబితాలో టీడీపీ నేత,మాజీ మంత్రి శిద్దా రాఘవరావు పేరుతో పాటు, మంత్రి ఆదిమూలపు సురేష్‌ పేరు కూడా ఉంది.  దీనిపై స్పందించిన మంత్రి  ఆదిమూలపు సురేష్‌ తన పేరు పొరపాటున వచ్చి ఉండొచ్చని.. ఒకవేళ డబ్బు అకౌంట్‌లో వేసినా తిరిగి ప్రభుత్వానికి అందజేస్తానని క్లారిటీ ఇచ్చారు.

 అంతేకాదు ఎక్కడ తప్పు జరిగిందో అధికారులు కూడా ఆరా తీస్తున్నారు.అటు చీమకుర్తి పరిధి లబ్దిదారుల జాబితాలో తన పేరు ఉండడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు మాజీ మంత్రి శిద్దా రాఘవరావు. రైతు భరోసా లబ్దిదారుల జాబితా నుంచి తన పేరు తొలగించాలని కోరుతూ ఆయన ప్రకాశం జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ కు లేఖ రాశారు.  


వెంటనే తన పేరును తొలగించాలని కోకారు. అంతేకాదు జాబితాలో పేరు రావడానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. ఈ వ్యవహారంపై కలెక్టర్ కూడా విచారణకు ఆదేశించినట్లు తెలుస్తోంది.
ఇలా  మాజీ మంత్రి పేరు కూడా జాబితాలో రావడంతో అధికారులు సీరియస్‌గా తీసుకున్నారు.ఈ పధకానికి కేంద్రం కూడా సహాయం అందించటంతో ఈ పధకానికి వైఎస్ రైతు భరోసా-పీఎం కిసాన్ యోజన అని పేరు పెట్టారు 


మరింత సమాచారం తెలుసుకోండి: