తెలంగాణ లో ఈ నెల 5 నుంచి ప్రారంభమైన ఆర్టీసీ సమ్మె  నేటితో 14 రోజులకు చేరుకుంది. అయితే ఇప్పటి వరకు ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను కెసిఆర్ పరిష్కరించక పోగా... సమ్మె చేస్తున్న కార్మికులందరికీ ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ప్రభుత్వం అద్దె  ప్రైవేటు బస్సులు నడుపుతుంది. కొన్ని కొన్ని చోట్ల ప్రైవేటు స్కూల్ బస్సులు కూడా నడువుతుంది ప్రభుత్వం . అయితే ఆర్టీసీ సమ్మె దసరా పండుగ ముందు ప్రారంభించినప్పటికీ అప్పటికే విద్యార్థులందరికీ దసరా సెలవులు రావడంతో  విద్యార్థులందరికి   ఇబ్బందులు ఏర్పడలేదు. కాగా  సమ్మె ప్రారంభం 14 రోజులు గడుస్తున్నప్పటికీ ఇప్పటివరకు కెసిఆర్ ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను పరిష్కరించలేదు...  అటు  కార్మికులు కూడా  ప్రభుత్వం దిగి వచ్చి తమ డిమాండ్లను పరిష్కరించే  వరకు ఆర్టీసీ సమ్మె ఆపేది లేదని తేల్చి చెప్పేశారు. 

 

 

 

 

 అయితే ప్రభుత్వం తిప్పుతున్న అద్దె  ప్రైవేటు బస్సులు ప్రస్తుతం ప్రయాణికుల అవసరాలను పూర్తి స్థాయిలో తీర్చలేక పోతున్నాయి ఒక వేల  విద్యాసంస్థలు పునః  ప్రారంభం అయితే ఇక విద్యార్థులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కోవాల్సి వస్తుంది. దీంతో గత నెల 28 నుంచి ఈ నెల  13 వరకు విద్యా సంస్థలకు ఇచ్చిన దసరా సెలవులను... అక్టోబర్ 19 వరకు తెలంగాణ ప్రభుత్వం పొడిగించింది. అయితే అటు విద్యాసంస్థలు మాత్రం ఈ నెల 21న స్కూలు మళ్లీ తెరుస్తామని విద్యార్థుల తల్లిదండ్రులకు సందేశాలు పంపుతున్నాయి . ఈ నేపథ్యంలో ప్రభుత్వం అటు ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించకుండా విద్యాసంస్థల సెలవులను పొడిగిస్తూ పోతే విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతింటుందని విద్యార్థుల తల్లిదండ్రులు హైకోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. 

 

 

 

 

 కాగా అటు ఆర్టీసీ సమ్మెకు కూడా రోజురోజుకి మద్దతు పెరుగుతూ వస్తుంది. అయితే 14 రోజులుగా తాము అనేక రూపాల్లో తమ నిరసన తెలువుతూ  వస్తున్న కెసిఆర్ మాత్రం తమను రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారని ఆర్టీసీ కార్మికులు మండిపడుతున్నారు. అయితే నేడు నిజాంబాద్ లో జేఎసి, బీజేపీ మద్దతుతో  భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. డిపో 2 నుంచి ధర్నా చౌక్ వరకు బైక్ ర్యాలీ కొనసాగింది. అయితే నిజాంబాద్ లో ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా బాల బృందం కెసిఆర్ తాతా మా బడులు మూసేస్తే మా  చదువులు సాగేది ఎట్లా సాగేది.  ఆర్టీసీ సమస్య పరిష్కరించండి...  బడులు తెరిపించండి అంటూ ఓ ఫ్లెక్సీని పట్టుకుని నిరసన ర్యాలీ లో పాల్గొన్నారు. ఇదిలా ఉండగా శనివారం ఉదయం 10.30 గంటలకు   ఆర్టీసీ యూనియన్లతో  చర్చలు జరపాలని ఆర్టీసీ  యాజమాన్యాన్ని కోర్టు ఆదేశించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: