కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై వచ్చిన ఓ వదంతి సోషల్ మీడియాలో హలచల్  చేస్తోంది.  రాహుల్ గాంధీ ఇండియాని వదిలి లండన్‌  వెళ్లనున్నారని, అక్కడే స్థిరపడాలని భావిస్తున్నారని, ఇక్కడ తాను చేసేదేం లేదన్నారని’ చెబుతూ సంజయ్ స్వరూప్ శ్రీవాస్తవ తన ఫేస్‌బుక్‌లో ఒక వీడియోను  పోస్ట్ చేశారు.   బీజేపీ మహిళా మోర్చా నాయకురాలు, సోషల్ మీడియా జాతీయ ఇంఛార్జ్ ప్రీతి గాంధీ సైతం ఈ విషయంపై  స్పందించారు.


నమస్తే లండన్ అనే క్యాప్షన్‌తో రాహుల్ వీడియోను ట్వీట్ చేశారు వీరందరు. ‘ఈ కారణంతోనే రాహుల్ గాంధీని దేశ ప్రజలు ఇష్టపడటం లేదని’ అకాలీదళ్ ఎమ్మెల్యే మంజిందర్ ఎస్ సిర్సా కూడా  ట్వీట్ చేశారు.       వ్యాపారవేత్తలు మెహుల్ చోక్సీ, నీరవ్ మోదీలు విదేశాలకు వెళ్లిపోయి హాయిగా ఉన్నారని రాహుల్ గాంధీ మాట్లాడిన వీడియోను ఎడిట్ చేసి 11 సెకన్ల నిడివి గల వీడియోను రూపొందించారు. ఈ వీడియో హాట్ టాపిక్ అవుతోంది.అసలు ఇది నిజమా....! అని చూస్తే.... అక్టోబర్ 13, 2019న మహారాష్ట్రలోని లాతూర్‌లో ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీపై రాహుల్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.


‘నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీలు ఏ భయాలు లేకుండా హాయిగా నిద్రపోతున్నారు. నేను లండన్ వెళ్లిపోతానని . నా పిల్లల్ని అమెరికాలో చదివిస్తానని. భారత్‌తో తనకు  పని లేదని. నరేంద్ర మోదీ మిత్రులలో నేనొకడిని. నాతో చాలా డబ్బులున్నాయిని. కోరుకున్నప్పుడు నేను ఎక్కడికైనా వెళ్లగలుగుతానని’ రాహుల్ వ్యంగ్యంగా ప్రసంగించారు.దానిని పట్టుకొని  అక్టోబర్ 13వ తేదీన శ్రీవాస్తవ ఆ పోస్ట్ చేశారు. 


ఉద్దేశపూర్వకంగానే కొందరు రాహుల్ గాంధీ ప్రసంగం వీడియోను ఎడిట్ చేసి, ఆయన లండన్‌లో స్థిరపడాలని భావిస్తున్నారంటూ ప్రచారం కల్పించారు. తన గురించి రాహుల్ చెప్పిన మాటల్ని, ఆ వెంటనే కుటుంబంతో కలిసి లండన్‌లో స్థిరపడతానని చెప్పిన విషయాలతో రూపొందించిన సోషల్ మీడియాలో పోస్ట్ కావడంతో హాట్ టాపిక్ అయింది. తాను ఫ్యామిలితో కలిసి లండన్‌లో స్థిరపడాలని భావిస్తున్నట్లు రాహుల్ చెబుతున్నట్లుగా ఉన్న వీడియోలో వాస్తవం లేదని టైమ్స్  టీమ్ గుర్తించింది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న రాహుల్ చేసిన కొన్ని వ్యాఖ్యలను ఎడిట్ చేసి వీడియో వైరల్ చేశారని గమనించాల్సిందిగా రాహుల్ కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: