కేసీఆర్‌  బహిరంగసభ రద్దు కావడంతో ప్రకృతి కూడా తీవ్ర అసంతృప్తిగా ఉందని, నిరంకుశ విధానాలకు ప్రకృతి ప్రకోపించిందని కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్‌ దాసోజు శ్రవణ్‌ తీవ్ర వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ కారణం వల్లనే హుజూర్‌నగర్‌ బహిరంగసభకు కేసీఆర్‌ హెలికాఫ్టర్‌ ద్వారా కూడా రాలేనంతగా ప్రకృతి శపించిందని అన్నారు దాసోజు శ్రవణ్‌.


తెలంగాణ ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపాలని హైకోర్టు ఆదేశిస్తే.. తమకేమీ తెలియనట్లు  కేసీఆర్‌ పాలన కోనసాగుతోందని, ఇది కోర్టు ధిక్కారం అవుతుందని, కేసీఆర్‌ నియంత అని చెప్పడానికి ఇంతకంటే మరో ఉదాహరణ ఏమి కావాలి అని విమర్శనా చేశారు. ఇక  కార్మికులు పని చేసిన వారికీ కూడా జీతాలు ఇవ్వకుండా  ఆరీస్టీ ఉద్యోగులను సమయంలో ఇబ్బందులకు గురి చేశారు అని అన్నారు.


ఇక హుజూర్‌నగర్‌ అసెంబ్లీ ఉప ఎన్నికల ప్రచారం కోసం హెలికాప్టర్‌లో రావాలనుకున్న సీఎం కేసీఆర్‌కి ప్రకృతి కూడా అడ్డుపడింది, దీని ఫలితంగాకే కేసీఆర్‌ బహిరంగసభను రద్దు చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది అని అన్నారు. ప్రభుత్వం చేసే పనులకు వ్యతిరేకంగా ప్రజలే కాదు దేవుడు కూడా ఉన్నాడని చెప్పడానికి కేసీఆర్ హెలికాప్టర్ ఆగిపోవడమే దీనికి నిద్దర్శనం అని తెలియచేసారు.


ఆర్టీసీ కార్మికుల ఉద్యోగుల సమ్మె పట్ల అత్యంత నిరంకుశంగా వ్యవహరిస్తూ ఉన్న కేసీఆర్ సర్కార్ పాలన సాగిస్తున్నారని, నిరుద్యోగుల అసలు అన్ని  అడియాశలు చేశారని ఆరోపణలు చేశారు. ఇక కేసీఆర్‌ పతనం మొదలు అయంది. 50 వేలమంది ఆర్టీసీ సిబ్బంది జీవితాలను గాల్లోదీపంలో పెట్టిన కేసీఆర్‌కు సిబ్బంది కుటుంబాల ఉసురు కచితంగా మీకు తగులుతోందని దాసోజు వ్యాఖ్యలు చేయడం జరిగింది. తెలంగాణ ప్రజలు ఎప్పుడు అన్నీ మరిచిపోయి  తమ వెంటే ఉంటారన్న  భావన వద్దు అని తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: