అక్రమ కట్టడాలను తొలగించి,కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకొనే వారికోసం కొత్త పథకాన్ని ప్రవేశపెట్టినట్టు జగన్ సర్కార్ కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు.

అలాగే నదులు కాలువగట్ల వెంబడి కట్టిన ఇల్లను కూల గొట్టే పనిలో పడిన గవర్నమెంట్ వారు ఇప్పుడు కొత్తగా వారికి కూడా ఇల్లు ఇచ్చేందుకు కూడా నిర్ణయించుకున్నారు.

ఆ విధానంలో భాగంగా జగన్ సర్కార్ కొత్తగా ఇళ్ల స్థలాలను రిజిస్ట్రేషన్ చేయించుకొనే వారికి కూడా రెండు సెంట్ల లోపు వారు అయితే రెండు రూపాయలకె తమ రిజిస్ట్రేషన్ చెయ్యాలి అని తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.అలాగే అక్రమంగా కట్టే కట్టడాలు కట్టడాలను ఖచ్చితంగా ఆపేసే పనుల్లో పడ్డారు ప్రభుత్వం. ఇది ఇలా ఉంటే ప్రతి ఒక్కరికి ఇల్లు ఇచ్చే పథకం కూడా వారు ప్రవేశ పెట్టారు.అయితే దీనికి అర్హులైన వారికి అపార్ట్ మెంట్ లో ప్లాట్ ఇవ్వకుండా ఎవరికి వారికి ఇండివిడ్యుల్ గా ఇల్లు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకుంది.ఇందులో కులం చూడకుండా,మతం చూడకుండా,ప్రాంత తేడాలు చూడకుండా అర్హులైన ప్రతొక్కరికి అందేలా చూడటమే లక్ష్యం గా వాలంటరీస్ చేసిన సర్వే,సచివాలయం వారు నిర్దేశించిన ప్రతొక్కరికి కూడా ఇచ్చేందుకు చూస్తున్నారు.అయితే రెండు సెంట్ల పైన ఉన్నవాళ్లు యధావిధిగా వారికి తగ్గ రుసుము కట్టాలని కూడా పేర్కొన్నారుఇందులో మోసాలకు పాల్పడిన వారిపై కఠిన చర్య తీసుకోవడానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నారు.ఇదిలా ఉంటే రోడ్ల విస్తీర్ణంలో భాగంగా పడేసిన చిరు కార్మికుల ఇళ్లను,చిరు బతుకులు బతికే వారికి కూడా ఇల్లు ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.పేదవాడి కనీస అవసరం ఇల్లు అనేది కల్పించడమే జగన్ యొక్క ముఖ్య ఉద్దేశంగా భావించి ఉన్నట్లు కూడా విశ్వసనీయ వర్గాలు వెల్లడిస్తున్నారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: