ఆంధ్ర అంటే ఒక రాష్ట్రం కాదు... ఆంధ్ర అంటే ఒక బ్రాండ్.. అన్న మాదిరి ఆంధ్ర రాష్ట్ర ప్రగతి పెంచడం కోసం ఏపీ సర్కారు ఫోకస్ పెట్టింది. దీనికి గాను ఓ మంచి లోగో డిజైన్ చేయాలని., దానికో మంచి ట్యాగ్ లైన్ పెట్టాలని ప్రజలను సూచించింది. మెప్పించిన మొదటి మూడు ఎంట్రీలకు నగదు బహుమతులుంటాయని., అందులో మొదటి బహుమతిగా రూ.50 వేలు, రెండో బహుమతిగా రూ.25 వేలు, మూడో బహుమతిగా రూ.15 వేలు అందజేస్తామని ప్రకటించింది. ఈ లోగో డిజైన్ను అక్టోబర్ 28లోగా ప్రభుత్వానికి అందచేయాలని., జగన్మోహన్ తన ఫేస్‌బుక్ పేజీ ద్వారా తెలియజేశారు. 
ఒక్క ఆంధ్ర పౌరులు మాత్రమే కాక భారత పౌరులు ఎవరైనా సరే ఈ లోగో డిజైన్ పోటీలో పాల్గొనవచ్చని..,, స్వ లేదా టీమ్ వర్క్ ద్వారా అయిన సరే లోగో డిజైన్ చేయవచ్చని., కానీ! ఆధార్ కార్డుతో మాత్రం వ్యక్తిగతంగానే దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. వచ్చిన దరఖాస్తులను ఓ కమిటీ పరిశీలిస్తుందని.., ఈ లోగోను దాదాపు ప్రభుత్వంలోని అన్ని విభాగాలు లేదా కొన్ని విభాగాలు ఉపయోగించుకుంటాయని  జగన్ తెలిపారు.. 
అయితే ఈ లోగో రూపనలో కొన్ని నిబంధనలు ఉన్నాయి.. లోగో ఒరిజినల్‌దై ఉండాలి.. ఎటువంటి కాపీ రైట్ చట్టాన్ని ఉల్లంఘించకూడదు.. ఏవైనా కాపీరైట్ సమస్యలు ఎదురైతే.. దానికి పూర్తి బాధ్యత రూపొందించిన వారే వహించాల్సి ఉంటుంది. ఏపీ ఇండస్ట్రీస్ వెబ్‌సైట్ ద్వారా కాంపిటీషన్ వివరాలను అప్‌డేట్ చేస్తామని.. విజేతలను ఈమెయిల్ ద్వారా ప్రకటిస్తామని ఆంధ్ర ప్రభుత్వం తెలిపింది.  
గతంలో కేంద్ర ప్రభుత్వం వారు కూడా ఇదే తరహాలో స్వచ్ఛభారత్ లోగో డిజైన్, ట్యాగ్‌‌లైన్ కోసం పోటీ నిర్వహించింది. అందులో భాగంగా లోగో ను మహారాష్ట్రకు చెందిన అనంత్ ఖస్బార్దార్ రూపొందించినది ఎంపిక చేయగా,, దానికి తగ్గ ట్యాగ్ లైన్ను గుజరాత్‌కు చెందిన భాగ్యశ్రీ సేథ్ రూపొందించినదాన్ని మోదీ సర్కారు ఎంపిక చేయడం జరిగింది.


మరింత సమాచారం తెలుసుకోండి: